Panchami
-
మూఢ నమ్మకాల నేపథ్యంలో...
‘పంచమి’ చిత్రదర్శకురాలు సుజాత భౌర్య దర్శకత్వంలో మరో సినిమా ఆరంభమైంది. హర్షవర్ధన్, సుజయ్, వేణు, శాంతి మహరాజ్, మమతా కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై చల్లా విజయ్‌కుమార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సిరాజ్ క్లాప్ ఇచ్చారు. దర్శకురాలు మాట్లాడుతూ– ‘‘దర్శకురాలిగా నాకిది మూడవ చిత్రం. కామెడీ, హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. మూఢ నమ్మకాలను ఆధారం చేసుకుని కథ సిద్ధం చేశా. ఇందులో బాలిక పాత్ర హైలెట్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘కథ వినగానే ఎగై్జట్ అయ్యా. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా’’ అన్నారు నిర్మాత విజయ్ కుమార్. తనికెళ్ల భరణి, జయసుధ, ఉత్తేజ్, జీవా, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నందర్ కృష్ణ, సంగీతం: శ్రీ కోటి. -
అంత్యపుష్కరాలకు పంచమి శోభ
జిల్లాలో 1,31,543 మంది పుష్కర స్నానాలు నాగ పంచమి, గరుడ పంచమితో గోదావరి తీరంలో వెల్లివిరిసిన భక్తిభావం కిటకిటలాడిన దేవాలయాలు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఎనిమిదో రోజు నదీ తీరం వెంబడి పంచమి శోభ నెలకొంది. ఆదివారం గరుడ పంచమి, నాగపంచమి కావడంతో పుష్కరస్నానం చేసి గోదావరి మాతకు పూజలు చేయడానికి భక్తకోటి తరలివచ్చింది. గోదావరి తీరం వెంబడి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మహిళలు అరటి దొప్పలపై దీపాలు వెలిగించి గోదావరి మాతకు పూజలు చేశారు. జిల్లావ్యాప్తంగా 1,31,543 భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు జిల్లాలోని అప్పన్నపల్లి, అయినవిల్లి, అంతర్వేది, రాజోలు, కోటిపల్లి, ధవళేశ్వరంలోని రామపాదాలరేవు తదితర ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సుగర్ లెవెల్ తగ్గడంతో కోటిలింగాల ఘాట్‌లో పడిపోయిన విశాఖపట్నానికి చెందిన పి.జనార్థనరావు చేతికి స్వల్ప గాయమైంది. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, నోడల్ అధికారి వి.విజయరామరాజు ఘాట్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీశేషసాయి కార్పొరేటర్లతో కలసి ఘాట్ల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. వరదల వల్ల రాజమహేంద్రవరంలోని ఘాట్లకు వస్తున్న వ్యర్థాలను తరచూ తొలగించకపోవడంతో స్నానమాచరించేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గరుడ పంచమిని పురస్కరించుకుని అప్పన్నపల్లిలో సుమారు 20 వేల మంది పుష్కర స్నానం చేశారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో 47,450 మంది పుణ్య స్నానాలు చేశారు. వీఐపీల ఘాట్‌లో ప్రముఖుల పుష్కర స్నానాలు... రాజమహేంద్రవరంలోని సరస్వతీ(వీఐపీ)ఘాట్‌లో ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కరస్నానం చేశారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ బి.శివశంకర్‌రావు తన సోదరుడితో కలసి పుణ్యస్నానం ఆచరించి తీర్థవిధులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఏవీ నిర్మలా గీతాంబ పుష్కర స్నానం చేశారు. 2012 నుంచి భారత్ పరిక్రమ పాదయాత్ర చేస్తున్న రాషీ్ట్రయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ప్రధాన ప్రచారక్ సీతారాంజీ తన అనుచరులతో కలసి పుణ్యస్నానం ఆచరించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ పుష్కర స్నానం చేసి, గోదావరి మాత విగ్రహం వద్ద పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. భక్తుల మనసులు గెలుస్తున్న వలంటీర్లు... స్వచ్ఛంద సంస్థలు, వివిధ కాలేజీల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ క్యాడెట్లు భక్తుల అభినందనలు అందుకుంటుంన్నారు. ఆంధ్రకేసరి డిగ్రీ, జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 100 మంది రోజూ కోటిలింగాల ఘాట్‌లో, ఆర్ట్స్ కాలేజీ, ఆదిత్య కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదికవి నన్నయ్య వర్సిటీ విద్యార్థులు, శ్రీకల్కి మానవ సేవా సమితి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. శోభాయమానంగా గోదావరి హారతి రాష్ట్ర దేవాదాయ శాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పుష్కరఘాట్‌లో నిర్వహిస్తోన్న గోదావరి హారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. నాగ పంచమితో పాటు ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హారతిని దర్శించుకున్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ హారతి కార్యమ్రాన్ని వీక్షించారు. ఆనం కళాకేంద్రంలో విశాఖపట్నానికి చెందిన శ్రీసాయి కళానికేతన్ వెల్ఫేర్ బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం ప్రేక్షకులను అలరించింది. సరస్వతిఘాట్‌లో శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళా క్షేత్రం వారి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కోటిలింగాల ఘాట్‌లో రాత్రి ఏడు గంటలకు నగరపాలక సంస్థ గులే బకావళి కథ చిత్రాన్ని ప్రదర్శించింది. -
ఘనంగా నాగపంచమి
-
విభిన్న ప్రయత్నం!
అర్చన కథానాయికగా కేవలం ఒకే పాత్రతో రూపొందిన ‘పంచమి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని సుజాత బౌరియా దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మించారు. ఆదివారం జరిగిన ఈ చిత్రం సక్సెస్ మీట్లో అర్చన మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన ప్రయత్నం. వాణిజ్య విలువలతో వైవిధ్యమైన కథాంశం నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీ రోల్ పోషించాయి’’ అని తెలిపారు. సినిమాకి మంచి స్పందన లభిస్తోందని నిర్మాత అన్నారు. రఘు.ఆర్.బళ్లారి, రావులపల్లి ప్రసాద్, శ్రీకోటి కూడా మాట్లాడారు. -
ఏకపాత్రాభినయం
‘‘ఈ సినిమాలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. ఆ పాత్రను అర్చన అద్భుతంగా పోషించారు. ఆమె చేసిన ప్రమాదకర విన్యాసాలు అమితంగా ఆకట్టుకుంటాయి’’ అని దర్శకురాలు సుజాత బౌరియా అన్నారు. అర్చనతో డి. శ్రీకాంత్ నిర్మించిన ‘పంచమి’ ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ -‘‘వృత్తిలో భాగంగా అడవిలోకి వెళ్లి ఇబ్బందులు పడ్డ ఫొటోగ్రాఫర్ కథ ఇది’’ అని చెప్పారు. దర్శకురాలు ఈ సినిమా బాగా తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. ఇది మంచి ప్రయోగమని సంగీత దర్శకుడు శ్రీకోటి చెప్పారు. -
మనిషికి మరణం లేదా?
మరణం లేకుండా మనిషి జీవించడం ఎలా? అనే వినూత్న కథాంశంతో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. సుజాత భౌరియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని అర్చన చేశారు. ఒకే ఒక్క పాత్రతో సాగే ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘అర్చన అందచందాలు, అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే తనికెళ్ల భరణిగారు అందించిన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణ అవుతుంది. తెలుగు తెరపై రాని కథతో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సైన్స్‌పరంగా దేవుళ్లే లేరని అంటున్న ఈరోజుల్లో నమ్మినవ్యక్తులను ఆ దేవుడు ఎలా కాపాడతాడు? అనే అంశాన్ని చూపించాం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం ఇది. శ్రీకోటి స్వరపరచిన పాటలు, రఘు. ఆర్. కెమెరా పనితనం హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
చావు లేకుండా జీవించడం ఎలా?
పంచమి ఓ మంచి ఫొటోగ్రాఫర్. ఫొటోలు తీయడానికి అడవుల్లోకి వెళ్లి, అనుకోకుండా అక్కడే రెండు రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. ఆ అడవిలో ఏం జరిగింది? పంచమి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అనే కథాంశంతో మేఘన మరియు హర్ష సమర్పణలో డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. టైటిల్ రోల్‌ని అర్చన చేయగా, సుజాత భౌర్య దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు తెలుగులో రాని కథ, కథనాలతో ఈ చిత్రం చేశాం. సైంటిఫిక్‌గా మనిషి మరణం లేకుండా జీవించడం ఎలా? అనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. తనికెళ్ల భరణిగారి వాయిస్ ఓవర్, శ్రీకోటి స్వరపరచిన పాటలు, గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో సుజాత ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
అడవిలో ఒంటరిగా ‘పంచమి’
‘‘ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ చాలా వస్తున్నాయి. తొలి ప్రయత్నంగా వాటికి భిన్నంగా ఓ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఏక పాత్రతో ఈ సినిమా చేయడం జరిగింది’’ అన్నారు సుజాత బౌర్య. అర్చన కథానాయికగా మేఘన హర్ష సమర్పణలో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై సూజాత బౌర్య దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ - ‘‘మంచి ఫొటోలు తీయడానికి అడవికి వెళ్లే పంచమి అనే అమ్మాయికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్ర కథాంశం. సినిమాలో అర్చన నీడ కూడా కనిపించదు. రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. రిస్కీ సీన్స్‌ని అర్చన చాలా ధైర్యంగా చేశారు. కొన్నిసార్లు గాయాలు కూడా అయ్యాయి. అయినా ఖాతరు చేయలేదు. ఈ చిత్రంలో 52 నిమిషాలు పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. ప్రేక్షకులను ఓ సరికొత్త అనుభూతికి గురి చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. తదుపరి ఓ ప్రముఖ హీరోతో రొటీన్‌కి భిన్నంగా ఉండే ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నానని సుజాత అన్నారు. -
‘పంచమి’ నాకు మంచి చేస్తుంది
‘‘ఈ ఏడాది నాకు చాలా కీలకం. ‘పంచమి’ నాకు మంచి చేస్తుంది. ఇందులో నేను ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాను. ఒకమ్మాయి అడవిలో చిక్కుకుని శివతత్వంతో ఎలా బయట పడిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని అర్చన తెలిపారు. సుజాత బౌర్య దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మించిన ‘పంచమి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని వరుణ్‌సందేశ్ ఆవిష్కరించి, తొలి ప్రతిని సుద్దాల అశోక్‌తేజకు అందించారు. ఈ సందర్భంగా అశోక్‌తేజ మాట్లాడుతూ -‘‘ఒకే పాత్రతో రెండు గంటల సినిమా తీసిన దర్శక నిర్మాతలకు హేట్సాఫ్’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘కథ విని తొలుత నేను చాలా ఆశ్చర్యపోయా. అసలు ఇలాంటి కథ ఉంటుందా అనిపించింది. శ్రీకోటి సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా గోపీనాథరెడ్డి, ప్రసన్నకుమార్, మనోజ్ నందం, సుజాత బౌర్య, శ్రీ కోటి, గీతామాధురి కూడా మాట్లాడారు.