‘పంచమి’ నాకు మంచి చేస్తుంది
‘పంచమి’ నాకు మంచి చేస్తుంది
Published Sat, Aug 17 2013 1:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
‘‘ఈ ఏడాది నాకు చాలా కీలకం. ‘పంచమి’ నాకు మంచి చేస్తుంది. ఇందులో నేను ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాను. ఒకమ్మాయి అడవిలో చిక్కుకుని శివతత్వంతో ఎలా బయట పడిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని అర్చన తెలిపారు. సుజాత బౌర్య దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మించిన ‘పంచమి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
ఆడియో సీడీని వరుణ్‌సందేశ్ ఆవిష్కరించి, తొలి ప్రతిని సుద్దాల అశోక్‌తేజకు అందించారు. ఈ సందర్భంగా అశోక్‌తేజ మాట్లాడుతూ -‘‘ఒకే పాత్రతో రెండు గంటల సినిమా తీసిన దర్శక నిర్మాతలకు హేట్సాఫ్’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘కథ విని తొలుత నేను చాలా ఆశ్చర్యపోయా.
అసలు ఇలాంటి కథ ఉంటుందా అనిపించింది. శ్రీకోటి సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా గోపీనాథరెడ్డి, ప్రసన్నకుమార్, మనోజ్ నందం, సుజాత బౌర్య, శ్రీ కోటి, గీతామాధురి కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement