అడవిలో ఒంటరిగా ‘పంచమి’ | Single Character movie Panchami | Sakshi
Sakshi News home page

అడవిలో ఒంటరిగా ‘పంచమి’

Published Sat, Sep 7 2013 12:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

అడవిలో ఒంటరిగా ‘పంచమి’

అడవిలో ఒంటరిగా ‘పంచమి’

 ‘‘ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్స్ చాలా వస్తున్నాయి. తొలి ప్రయత్నంగా వాటికి భిన్నంగా ఓ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఏక పాత్రతో ఈ సినిమా చేయడం జరిగింది’’ అన్నారు సుజాత బౌర్య. అర్చన కథానాయికగా మేఘన హర్ష సమర్పణలో ఐడియా మూవీ క్రియేషన్స్ పతాకంపై సూజాత బౌర్య దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. 
 
 ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ - ‘‘మంచి ఫొటోలు తీయడానికి అడవికి వెళ్లే పంచమి అనే అమ్మాయికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ చిత్ర కథాంశం. సినిమాలో అర్చన నీడ కూడా కనిపించదు. రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
 
 రిస్కీ సీన్స్‌ని అర్చన చాలా ధైర్యంగా చేశారు. కొన్నిసార్లు గాయాలు కూడా అయ్యాయి. అయినా ఖాతరు చేయలేదు. ఈ చిత్రంలో 52 నిమిషాలు పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. ప్రేక్షకులను ఓ సరికొత్త అనుభూతికి గురి చేసేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. తదుపరి ఓ ప్రముఖ హీరోతో రొటీన్‌కి భిన్నంగా ఉండే ఓ ప్రేమకథా చిత్రం చేయబోతున్నానని సుజాత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement