అవార్డుల్లో ‘క్లిక్’ అయింది..
అద్భుతంగా ఉంది కదూ.. ఇటలీలో మిరుమిట్లు గొలిపేలా కనిపించిన మన పాలపుంత (మిల్కీవే)ను ఇవాన్ అనే ఫొటోగ్రాఫర్ ఇలా కెమెరాలో బంధించాడు. పాలపుంత అందాలను కళ్లకు కడుతున్న ఈ ఫొటో అద్భుతంగా ఉంది కాబట్టే.. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డు-2014 ఓపెన్ కేటగిరీలో మొదటి స్థానాన్ని గెలుచుకుంది. 70 వేల ఎంట్రీలను తోసిరాజని ఈ ఫొటో అవార్డును దక్కించుకుంది. అన్నట్టూ... విశ్వంలో కోట్ల గెలాక్సీలు ఉండగా.. అందులో మన పాలపుంత కూడా ఒకటి. పాలపుంతలో సూర్యుడితో సహా సుమారు పది వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయట.