ప్రముఖ హీరో బాడీగార్డ్‌ వీరంగం..! | hero bodyguard Shera booked for assault | Sakshi
Sakshi News home page

ప్రముఖ హీరో బాడీగార్డ్‌ వీరంగం..!

Published Wed, Oct 26 2016 2:26 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రముఖ హీరో బాడీగార్డ్‌ వీరంగం..! - Sakshi

ప్రముఖ హీరో బాడీగార్డ్‌ వీరంగం..!

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్‌ షేరా వీరంగం వేశాడు. అంధేరిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గొడవలో ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు షేరాపై కేసు నమోదు చేశారు.

డీఎన్‌ నగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.00 గంటల ప్రాంతంలో షేరా, ఫిర్యాదిదారు పరస్పరం దూషించుకున్నారు. ఆ తర్వాత జరిగిన గొడవలో షేరా అతనిపై విరుచుకుపడ్డాడు. ’గొడవ ఎందుకు జరిగింది అన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ ఓ వ్యక్తి వచ్చి షేరాకు ఫోన్‌ ఇచ్చాడు. ఫోన్‌లో అతను మాట్లాడుతూ తీవ్రంగా దుర్భాషలు ఆడాడు. ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత తన సమీపంలో ఉన్న వ్యక్తితో షేరా గొడవ పడ్డాడు. ఇద్దరూ తిట్టుకున్నారు. దీంతో షేరా అతన్ని తుపాకీతో హెచ్చరించాడు. అంతేకాకుండా బేస్‌బ్యాట్‌తో అతనిపై దాడి చేశాడు. దీంతో అతనికి భుజం చేరువలో ఎముక విగిరి తీవ్రగాయమైంది’ అని డీఎన్‌ నగర్‌ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక‌్షన్‌ 326, 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న షేరా కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement