Shera
-
హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
హీరోలు కోట్లు సంపాదిస్తారు.. వారి కింద పనిచేసే బాడీగార్డులు కూడా లక్షలు వెనకేస్తుంటారు! స్టార్ హీరోల బాడీగార్డుల సంపాదన గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి కోట్లల్లో ఆదాయం ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. షేరా అలియాస్ గుర్మీత్ సింగ్.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రెండు దశాబ్దాలుగా బాడీగార్డుగా పని చేస్తున్నాడు. ఇతడికికి టైగర్ అని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ కూడా ఉంది. బాడీగార్డు ఉంటేనే అడుగు బయటకురవి సింగ్ విషయానికి వస్తే.. ఇతడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు వ్యక్తిగత అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. యూసుఫ్ ఇబ్రహీం.. ఆలియా భట్, వరుణ్ ధావన్ వంటి పలువురు హీరోహీరోయిన్లకు బాడీగార్డుగా సేవలందిస్తున్నాడు. వీరు సెలబ్రిటీలు ఇల్లు దాటి బయటకు వెళ్లినప్పుడు వారికి రక్షణగా నిలుస్తారు. ఈవెంట్లకు వెళ్లినా, ఎక్కడికైనా ప్రయాణించినా సదరు నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.బాడీగార్డులకు కోట్లల్లో ఆదాయం?సెలబ్రిటీటల పట్ల అంకితభావంతో పనిచేసే వీరు బాగానే డబ్బు కూడబెడతారని ఫిల్మీదునియాలో ఓ టాక్ ఉంది. దీనిపై హీరోయిన్ ఆలియా భట్ బాడీగార్డ్ యూసఫ్ ఇబ్రహీం(Bollywood bodyguard Yusuf Ibrahim) క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముందుగా షారూఖ్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడా? అన్న ప్రశ్నకు ఇలా స్పందించాడు. చూడండి.. ఎవరెంత సంపాదిస్తున్నారనేది మాకు తెలియదు. ఒకరి ఆదాయం మరొకరికి తెలియదు. తెలిసే అవకాశమే లేదు అన్నాడు. మీకు తెలియకుండా ఉంటుందా? అని యాంకర్ అడిగినప్పటికీ అతడు తెలీదనే అడ్డంగా తలూపాడు. మరి సల్మాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడంటున్నారు.. ఇది నిజమేనా? అన్న రెండో ప్రశ్న ఎదురైంది.(చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు, ఎందుకంటే?)నెలకు రూ.10 లక్షలు ఈజీగా..దీనికి ఇబ్రహీం స్పందిస్తూ.. షేరాకు సొంత బిజినెస్ ఉంది. అతడికంటూ ప్రత్యేకంగా సెక్యురిటీ కంపెనీ ఉంది. ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రెండు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు. అక్షయ్ కుమార్ అంగరక్షకుడు శ్రేసయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు ఆర్జిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు.. అతడి వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. అయినా నెలకు రూ.10-12 లక్షల ఆదాయం వేసుకున్నా ఏడాదికి రూ.1 కోటి ఈజీగా దాటుతుంది.కొన్నిసార్లు లెక్క మారుతుందికానీ కొన్నిసార్లు అంత డబ్బు రాకపోవచ్చు. ఎందుకంటే కొందరు షూటింగ్‌కు, ఈవెంట్స్‌కు, ప్రమోషన్స్‌కు వేర్వేరుగా డబ్బు లెక్కగడుతుంటారు. దాన్ని బట్టి సెలబ్రిటీలు ఎలాంటి కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్తున్నారో దాని ఆధారంగానే డబ్బిస్తారు. పైగా ఆయా సెలబ్రిటీ నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నాడనేదానిపై కూడా మా జీతం ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ ఎవరికి నచ్చినట్లు వారు లెక్కలు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నామని ఫిక్సయిపోయారు. కానీ సాధారణ బాడీగార్డులైతే నెలకు రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది అని ఇబ్రహీం చెప్పుకొచ్చాడు.చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.అయితే తాజాగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 1995 నుంచి సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన షేరా కొత్త రేంజ్ రోవర్‌ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. View this post on Instagram A post shared by shera (@beingshera) -
సెలబ్రిటీలకు తగ్గని సల్మాన్ బాడీగార్డ్ జీతం..ఎంతో తెలుసా?
సాధారణంగానే సెలబ్రిటీలకు జనాల్లో పిచ్చి క్రేజ్ ఉంటుంది. వాళ్లు ఏం చేసినా అభిమానులకు అది విశేషమే. అన్ని విషయాల్లోనూ స్టార్స్‌ను అనుకరిస్తుంటారు. ఇక వీళ్లు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాడీగార్డ్స్ ఉండాల్సిందే. లేదంటే మీడియా ఫాలోయింగ్, అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. దాదాపు అందరూ సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా బాడీగార్డ్స్ ఉంటారు. అయితే వీరి గురించి ఎక్కువగా ఎవరికి పరిచయం ఉండదు. కానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గురించి అందరికి తెలుసు. సల్లు భాయ్ బాడీగార్డ్ షెరా. ఇతను సెలబ్రిటీకి తక్కువేం కాదు. ఇటీవల భారత్‌కు వచ్చిన జస్టిన్ బీబర్‌కి బాడీగార్డ్‌గా వ్యవహరించిన షెరా తాజాగా మరోసారి వార్తలోకెక్కాడు. కేవలం సల్మాన్‌కు కాకుండా ముంబైకు విచ్చేసిన ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖలు.. విల్ స్మిత్, జాకీచాన్, మైకేల్ జాక్సన్ వంటి వారికి గార్డ్‌గా ఉన్నాడు. షెరా బాలీవుడ్ ఫెవరేట్ బాడీగార్డ్. ఇక సల్మాన్‌తో కలిసి 26 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఈ క్రమంలో సల్మాన్‌కు భద్రతగా ఉన్న షెరాకు నెలకు 15 లక్షల వరకు జీతం ఉన్నట్లు సమాచారం. అంటే సంవత్సరానికి రెండు కోట్ల వరకు ఉంటుందన్నమాట. చదవండి: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా -
ప్రముఖ హీరో బాడీగార్డ్ వీరంగం..!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా వీరంగం వేశాడు. అంధేరిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గొడవలో ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు షేరాపై కేసు నమోదు చేశారు. డీఎన్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.00 గంటల ప్రాంతంలో షేరా, ఫిర్యాదిదారు పరస్పరం దూషించుకున్నారు. ఆ తర్వాత జరిగిన గొడవలో షేరా అతనిపై విరుచుకుపడ్డాడు. ’గొడవ ఎందుకు జరిగింది అన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ ఓ వ్యక్తి వచ్చి షేరాకు ఫోన్ ఇచ్చాడు. ఫోన్లో అతను మాట్లాడుతూ తీవ్రంగా దుర్భాషలు ఆడాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత తన సమీపంలో ఉన్న వ్యక్తితో షేరా గొడవ పడ్డాడు. ఇద్దరూ తిట్టుకున్నారు. దీంతో షేరా అతన్ని తుపాకీతో హెచ్చరించాడు. అంతేకాకుండా బేస్బ్యాట్తో అతనిపై దాడి చేశాడు. దీంతో అతనికి భుజం చేరువలో ఎముక విగిరి తీవ్రగాయమైంది’ అని డీఎన్ నగర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 326, 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న షేరా కోసం గాలిస్తున్నారు.