బాడీగార్డుతో హీరోయిన్‌ దురుసు ప్రవర్తన! | Alia Bhatt Really Misbehave With Her Bodyguard, Viral Video | Sakshi
Sakshi News home page

బాడీగార్డుతో హీరోయిన్‌ దురుసు ప్రవర్తన!

Published Thu, Sep 19 2019 6:48 PM | Last Updated on Thu, Sep 19 2019 7:04 PM

Alia Bhatt Really Misbehave With Her Bodyguard, Viral Video - Sakshi

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన బాడీగార్డుల తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.  కారులోంచి దిగి నడుస్తూ వస్తున్న  ఆమెకు బాడీగార్డులు చుట్టూ రక్షణగా  ఉన్నారు. ఈ సమయంలో వారు ఆమెకు కొంత చేరువగా రావడంతో ఆలియా కొంత అసహనానికి లోనయ్యారు. ‘మీరు ముందు వెళ్లండి..’ అంటూ ఆమె ఒకింత అసహనంతో పలుమార్లు అన్నారు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఆలియా తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాడీగార్డులతో ఆలియా దురుసుగా ప్రవర్తించిందని, తనకు రక్షణగా ఉన్నవారిపై ఇలా ఆమె నోరుపారేసుకోవడం మంచిది కాదని, ఆలియా మూర్ఖంగా ప్రవర్తించిందని నెటిజన్లు ఈ వీడియోపై విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement