సల్మానే నా హీరో
సల్మానే నా హీరో
Published Mon, Jan 13 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
బాడీగార్డ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ అవకాశమిచ్చినా తిరస్కరించినందుకు వర్ధమాన తార డైసీ షా విచారం వ్యక్తం చేసింది. తాజా చిత్రం ‘జై హో’ లో సల్మాన్ సరసన డైసీ నటిస్తోంది. ‘ఒకే ఒక విషయమై విచారం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే సల్మాన్‌కు నేను నో అని చెప్పినందుకు. సల్మాన్‌తో పని చేసినా చేయకపోయినా నా జీవితంలోకి సల్మాన్ అనే వ్యక్తి ప్రవేశించడమొక్కటి చాలు. రీల్ లైఫ్‌తోపాటు రియల్ లైఫ్‌లోనూ సల్మానే నా కథానాయకుడు. ఆయనను నేనొక కథానాయకుడిగా భావిస్తా. ‘జై హో’లో సల్మాన్‌తో కలసి నటిస్తున్నా’ అని తెలిపింది. బాడీగార్డ్డ్ సినిమాలో కథానాయకుడి స్నేహితురాలి పాత్ర చేయాల్సిందిగా సల్మాన్...డైసీని కోరాడు.
అయితే ఆ పాత్ర ఆమెకు నచ్చలేదు. ‘నాకు ఇస్తానన్న ఆ పాత్రను అంగీకరించలేదు. అప్పట్లో నేనొక దక్షిణాది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా. దానికితోడు డేట్లు కూడా ఖాళీ లేవు. ఆ పాత్రలో నటించడాన్ని కొన్నాళ్లపాటు వాయిదా వేయడం కుదరలేదు. ఎప్పుడైనా ఒకదానిపైనే ఏకాగ్రత ఉండాలి. దీంతో నేను దక్షిణాది సినిమాకే మొగ్గుచూపా’ అని డైసీ వివరించింది. బాడీగార్డ్ సినిమాలో నటించననే విషయాన్ని తెలి యజేసేందుకు తనకు చాలా సమయం పట్టిందని తెలిపింది. నో అని ఎలా చెప్పాలో అర్ధంకాక ఏడెనిమిది రోజుల సమ యం తీసుకున్నానంది. అన్యమనస్కంగా ఏమి చేసినా వృథాయేననేది తన భావన అని తెలిపింది. తాను నో అని చెప్పిన తర్వాత సల్మాన్ ఏమీ అనలేదని, ఓకే అని మాత్రమే అన్నాడంది. బాడీగార్డు సినిమాలో తాను నటించలేదనే కోపం ‘జై హో’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సల్మాన్ ముఖంలో కనిపించిందని తెలిపింది.
Advertisement
Advertisement