ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు వింటనే కొన్ని దేశాలు వణికిపోతున్నాయి. కాగా, రష్యా ప్రెసిడెండ్ పుతిన్ ఓ స్పెషల్ పర్సన్.. అతడి ఏది చేసిన భిన్నంగా ఉంటుందని ఇప్పటికే పలు దేశాల పత్రికలు కథనాలను ప్రచురించాయి.
తాజాగా పుతిన్ గురించి మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పుతిన్ కోసం ఓ ప్రత్యేకమైన బాడీగార్డ్ ఉన్నాడనే విషయం బయటకు వచ్చింది. ఇక, పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆ బాడీగార్డ్ ఆయనేతోనే ఉంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ బాడీగార్డ్ చేసే పని తెలిస్తే ఖంగుతింటారు. పుతిన్ మలమూత్రాలను ఆ బాడీగార్డ్ సేకరిస్తుంటాడని తాజాగా ఓ రిపోర్ట్‌లో బహిర్గతమైంది. తాజాగా ఫాక్స్ న్యూస్ దీనిపై ఓ కథనాన్ని రాసింది.
ఇదిలా ఉండగా.. పుతిన్ ఆరోగ్య రహస్యాలు తెలియకుండా ఉండేందుకు.. బాడీగార్డు ఇలా ఆయన మలమూత్రాలను సేకరిస్తుంటారని సదరు వార్తా సంస్థ తాజా కథనంలో రాసుకొచ్చింది. ఇక, విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య రహస్యాలు బహిర్గతం కాకుండా పుతిన్ ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రెబెకా కోఫ్లర్ తెలిపారు. రష్యాకు చెందిన ఫెడరల్ గార్డ్ సర్వీస్ ప్రత్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుందని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మలమూత్రాలను తిరిగి మాస్కోకు పంపిస్తారని ఫ్రెంచ్ పత్రిక పేర్కొంది.
మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే పుతిన్‌కు కళ్లకు సంబంధించిన వ్యాధి ఉందని మరో మూడేళ్లలో కంటి చూపు మందగించే అవకాశం ఉందనే వార్తలు చక‍్కర్లు కొట్టాయి.
Putin's bodyguards have to box up his poop and send it back to Russia https://t.co/wBlGMdVBcP
— George Elis (@PeanutCaptain_) June 14, 2022
ఇది కూడా చదవండి: ఎలాన్‌మస్క్ కొత్త ఎత్తుగడ.. ఈసారి ఏకంగా ఉద్యోగులతో..
Comments
Please login to add a commentAdd a comment