ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898’మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ ప్రముఖులే సినిమాను ప్రశంసిస్తున్నారంటే.. నాగ్ అశ్విన్ మేకింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు దర్శకధీరుడు రాజమౌళి, ఆర్జీవీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొంత మంది టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ రోల్‌లో మెరిశారు.
(చదవండి: ఒరిజినల్ మాస్ హీరో అమితాబ్.. వెయ్యి కోట్లు పక్కా అంటున్న స్టార్స్)
అయితే వీరిలో బాగా హైలైట్ అయింది మాత్రం విజయ దేవరకొండ పాత్ర అనే చెప్పాలి. అర్జునుడి పాత్రలో రౌడీ హీరో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సినిమా చివరిలో ఐదు నిమిషాల పాటు కనిపిస్తాడు విజయ్. నిడివి తక్కువే అయినా ఆ సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై నెట్టింట చర్చ జరుగుతుంది.
(చదవండి: పాన్ ఇండియాపై ‘మెగా’ ఆశలు)
ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట విజయ్. స్నేహితుడు నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పేశాడట. పార్ట్ 2లోనూ విజయ్ పాత్ర కనిపించబోతుంది. విజయ్ ఒక్కడే కాదు గెస్ట్ రోల్‌గా నటించిన చాలా మంది రెమ్యునరేషన్ తీసుకోలేదట. కేలవం నాగ్ అశ్విన్, వైయంజతీ మూవీస్ బ్యానర్‌పై ఉన్న గౌరవంతో ఈ సినిమాలో నటించారట.
Comments
Please login to add a commentAdd a comment