విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇది 'భారతీయుడు 2' మూవీ గురించి అనుకుంటే మీ పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయిందని ఈయనకు కూడా తెలిసినట్లు ఉంది. దీంతో పూర్తిగా మర్చిపోయినట్లు ఉన్నారు. మరోవైపు 'కల్కి' సక్సెస్ గురించి ఏకంగా మూడున్నర నిమిషాలు మాట్లాడారు.
(ఇదీ చదవండి: 'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!)
కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన 'భారతీయుడు 2' రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఓ మాదిరి అంచనాలు ఉండేవి. కానీ సినిమా మరీ ల్యాగ్ ఉండటం పెద్ద మైనస్ అయింది. దీంతో ఘోరమైన డిజాస్టర్ దిశగా వెళ్తోంది. మరోవైపు దీనికి రెండు వారాల ముందు రిలీజైన పాన్ ఇండియా మూవీ 'కల్కి'లోనూ సుప్రీం యాష్కిన్ అనే విలన్ పాత్రని కమల్ చేశారు. రెండు మూడు సీన్లలో కనిపించినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలోనే కమల్ హాసన్ 'కల్కి' బ్లాక్ బస్టర్ కావడంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మూవీ టీమ్‌ని అభినందిస్తూనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని ఆకాశానికెత్తేశారు. దాదాపు మూడన్నర నిమిషాలు మాట్లాడారు. 'కల్కి' గురించి చాలా మాట్లాడారు కానీ రిలీజ్ తర్వాత 'భారతీయుడు 2' గురించి ఒక్క ట్వీట్, పోస్ట్, వీడియో గానీ కమల్ పెట్టలేదు. అంటే ఈయనకు కూడా రిజల్ట్ ఏంటే అర్థమైపోయింది అనుకుంటా!
(ఇదీ చదవండి: హీరోయిన్ మాల్వీ నా కొడుకుని మోసం చేసింది: అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి)
Comments
Please login to add a commentAdd a comment