మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేటు పెంచేశాడు. తాను ఇప్పటివరకు తీసుకుంటున్న పారితోషికం ఒకెత్తయితే తర్వాత చేయబోయే మూవీ కోసం మాత్రం ఊహించని మొత్తం అందుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ చరణ్ రెమ్యునరేషన్ ఎంత పెంచాడు? ఏంటి సంగతి? అనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: బాలకృష్ణ చీప్ బిహేవియర్.. హీరోయిన్ ని తోసేసి, మద్యం తాాగుతూ)
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అస్సలు అర్థం కాలేదు. అయితే ఈ ఏడాది అక్టోబరులోనే ఉండొచ్చని దిల్ రాజు కూతురు తాజాగా రివీల్ చేసింది. ఇకపోతే ఈ మూవీలో చేస్తున్నందుకు గానూ రూ.90 కోట్ల పారితోషికం చరణ్ అందుకుంటున్నాడట.
దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తాడు. 'RC16' వర్కింగ్ టైటిల్. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ కోసం చరణ్‌కి ఏకంగా రూ.125 కోట్ల మేర పారితోషికం ఇవ్వబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లలో చరణ్ ఒకడు అవుతాడు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
Comments
Please login to add a commentAdd a comment