కాలంతో పాటు సినిమా రూపాంతరం చెందుతోందనడంలో ఎటువంటి సందేహం ఉండదు. జయాపయజాలను బట్టి చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం స్థాయి మారుతూ వస్తోంది. ముఖ్యంగా ఒక చిత్రం హిట్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్లు ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తారన్నది తెలిసిన విషయమే. అయితే దీనికి చెక్ పెట్టే పరిస్థితి రానున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చాలామటుకు సినిమాను కార్పొరేట్ సంస్థలే ఏలుతున్నాయి. దీంతో పలు పాత చిత్ర నిర్మాణ సంస్థలు తెరమరుగు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలు స్టార్ హీరో హీరోయిన్లకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం.
రెమ్యునరేషన్ డిమాండ్..
సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లు నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తాయి. దీంతో అలాంటి నటీనటులను బాక్సాఫీస్ గాడ్స్‌గా భావిస్తుంటారు. నిజానిజాల మాట అటు ఉంచితే ఇటీవల ఒక హీరో నటించిన చిత్రం వసూళ్లు రూ.500 కోట్లు దాటినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలతో అలాంటి స్టార్స్‌కు క్రేజ్ మరింత పెరుగుతుంది. బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను బట్టి హీరో హీరోయిన్లు తమ రెమ్యునరేషన్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ సంస్థలే!
ఆ డబ్బుతోనే ఎక్కువ చెల్లిస్తున్నారు!
సాటిలైట్, ఓటీటీ సంస్థలు ఇచ్చే డబ్బుతోనే నిర్మాతలు హీరో హీరోయిన్లకు పారితోషికం పెంచేస్తున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతార కూడా రూ.10 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈమె తన చిత్రాలకు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేది లేదనే పలు కండిషన్లు పెడుతున్నారు. అయినా కానీ ఆమె మార్కెట్ తగ్గడం లేదు. ఇలాంటి వారికి తాజాగా కార్పొరేట్ సంస్థలు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 20 శాటిలైట్ హక్కులను, ఓటిటీ స్ట్రీమింగ్ హక్కులను ఇకపై అధిక ధరకు చెల్లించరాదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో స్టార్ హీరో హీరోయిన్ల పారితోషికం తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment