ప్రముఖ దర్శకుడి ఇంట పెళ్లి.. స్టార్స్‌ సందడి | Director Cheran Daughter Nivetha Priyadarshini Wedding | Sakshi
Sakshi News home page

పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్‌ చేసిన దర్శకనటుడు

Published Thu, Apr 25 2024 4:25 PM | Last Updated on Thu, Apr 25 2024 4:25 PM

Director Cheran Daughter Nivetha Priyadarshini Wedding - Sakshi

ప్రముఖ దర్శకనటుడు చేరన్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అతడి పెద్ద కూతురు నివేద ప్రియదర్శిని పెళ్లిపీటలెక్కింది. వ్యాపారవేత్త సురేశ్‌ ఆదిత్యతో ఏడడుగులు వేసింది. ఏప్రిల్‌ 22న చెన్నైలో ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సముద్రఖని, సీమన్‌, పాండిరాజ్‌, కేఎస్‌ రవికుమార్‌ తదితర కోలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

డైరెక్షన్‌ మీద ఆసక్తితో..
తన కూతురి పెళ్లికి విచ్చేసిన అతిథుల ఫోటోలను చేరన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా తమిళనాడులోని మధురైకి చెందిన చేరన్‌ డైరెక్షన్‌ మీద ఆసక్తితో చెన్నై చేరుకున్నాడు. మొదట్లో పలు సినిమాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పని చేశాడు. పురియత పూజం అనే సినిమాకు తొలిసారి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. పెద్ద సినిమాలకు సైతం సహాయ దర్శకుడిగా పని చేసిన ఇతడు తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించాడు. అనంతరం 'భారతీ కన్నమ్మ' చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు.

తొలి సినిమాతోనే హిట్‌
తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చేరన్‌ ఆటోగ్రాఫ్‌ అనే మూవీకి డైరెక్టర్‌గా పని చేయడంతోపాటు అందులో నటించడం విశేషం. ఈ చిత్రం అతడికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటినుంచి తను డైరెక్ట్‌ చేసిన ఎన్నో సినిమాల్లో నటుడిగానూ కనిపించాడు. ఆయన పని చేసిన నాలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ మధ్య తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం చేరన్‌.. కిచ్చా సుదీప్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ లాంచ్‌ చేశారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటిస్తోంది.

 

 

చదవండి: నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement