Cheran
-
ప్రముఖ దర్శకుడి ఇంట పెళ్లి.. స్టార్స్ సందడి
ప్రముఖ దర్శకనటుడు చేరన్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అతడి పెద్ద కూతురు నివేద ప్రియదర్శిని పెళ్లిపీటలెక్కింది. వ్యాపారవేత్త సురేశ్ ఆదిత్యతో ఏడడుగులు వేసింది. ఏప్రిల్ 22న చెన్నైలో ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సముద్రఖని, సీమన్, పాండిరాజ్, కేఎస్ రవికుమార్ తదితర కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.డైరెక్షన్ మీద ఆసక్తితో..తన కూతురి పెళ్లికి విచ్చేసిన అతిథుల ఫోటోలను చేరన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా తమిళనాడులోని మధురైకి చెందిన చేరన్ డైరెక్షన్ మీద ఆసక్తితో చెన్నై చేరుకున్నాడు. మొదట్లో పలు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేశాడు. పురియత పూజం అనే సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. పెద్ద సినిమాలకు సైతం సహాయ దర్శకుడిగా పని చేసిన ఇతడు తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించాడు. అనంతరం 'భారతీ కన్నమ్మ' చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు.తొలి సినిమాతోనే హిట్తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన చేరన్ ఆటోగ్రాఫ్ అనే మూవీకి డైరెక్టర్‌గా పని చేయడంతోపాటు అందులో నటించడం విశేషం. ఈ చిత్రం అతడికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటినుంచి తను డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాల్లో నటుడిగానూ కనిపించాడు. ఆయన పని చేసిన నాలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ మధ్య తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం చేరన్.. కిచ్చా సుదీప్తో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటిస్తోంది. திருமணத்தை மனப்பூர்வமான வாழ்த்துடன் நடத்தித்தந்த திரு.ரவிக்குமார் சார், மரியாதைக்குரிய திருமதி ரவிக்குமார் அவர்களுக்கும், எங்கள் பெருமைக்குரிய இயக்குனர் இமயம் திரு.பாரதிராஜா, அன்பு அண்ணன் சீமான், திருமதி சீமான் அவர்களுக்கும் எங்கள் குடும்பத்தினர் சார்பாக மகிழ்ச்சியும் நன்றியும். pic.twitter.com/owMd4lDBkW— Cheran (@directorcheran) April 23, 2024 చదవండి: నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్ -
త్వరలోనే రామదాస్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే?
సినీ, రాజకీయ సెలబ్రిటీల జీవిత చరిత్ర వెండితెరకెక్కడం పరిపాటిగా మారింది. గతంలో కామరాజర్, జయలలిత, గాంధీజీ, క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని ఇలా పలువురు ప్రముఖుల బయోపిక్‌లు చిత్రాలుగా రూపొందాయి. తాజాగా పీఎంకే నేత రామదాస్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు భారతి కనమ్మ, వెట్రిక్కోడి కట్టు, పాండవ భూమి, ఆటోగ్రాఫ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన చేరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ కథానాయకుడిగా నటించిన చేరన్ ఇటీవల జర్నీ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకత్వం పైనే దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా తమిళం, కన్నడం భాషల్లో ఒక చిత్రం చేస్తున్నారు. దీన్ని పూర్తిచేసిన తరువాత డా.రామదాస్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో డి.రామదాస్ పాత్రలో శరత్‌కుమార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రామదాస్ ఒక్కపక్క వైద్యవృత్తి నిర్వహిస్తునే మరో పక్క అణగారిన వన్నియార్ సామాజిక వర్గం న్యాయ హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడడం, అలా పాట్టాలి మక్కల్ కట్చి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడం వంటి అంశాలతో బయోపిక్‌ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి మరో డిఫరెంట్ సిరీస్.. స్టార్ దర్శకుడికి ఇదే తొలిసారి
మరో స్టార్ డైరెక్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈయన తీసిన తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, సిరీస్ విశేషాలను పంచుకున్నారు. ఇంతకీ ఈ సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది? సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) రవితేజ కెరీర్లో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీన్ని తీసింది దర్శకుడు చేరన్. స్వతహాగా తమిళంలో సినిమాలు తీసే ఇతడు.. ఈ మధ్యే హీరోగానూ మారాడు. ఇప్పుడు ఓటీటీల్లోకి కూడా అడుగుపెట్టేశాడు. 'చేరన్స్ జర్నీ' పేరుతో తీసిన సిరీస్.. ఈ జనవరి 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. చూస్తుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. 9 ఎపిసోడ్స్‌తో తీసిన ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఓ పెద్ద కంపెనీకి బాస్ (శరత్ కుమార్), ఓ ఉద్యోగం కోసం ఐదుగురిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇందులో నలుగురు అబ్బాయిలు- ఓ అమ్మాయి ఉంటుంది. వీళ్లకు రకరకాల పరీక్షలు పెట్టి చివరకు ఒక్కరిని ఎంపిక చేస్తారు? ఈ క్రమంలోనే వీళ్లు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అసలేంటి ఉద్యోగం? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఓటీటీనే కాబట్టి తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసే అవకాశముంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
ఆరేళ్ల తర్వాత ఆ దర్శకుడి సినిమా.. KGF బ్యూటీ హీరోయిన్
కేజీఎఫ్ సినిమాతో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి వేరే లెవల్ క్రేజ్ వచ్చింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే క్రేజీ ఛాన్సులు కొట్టేస్తోంది. తాజాగా సిద్ధు కొత్త మూవీ 'తెలుసు కదా'లో అవకాశం దక్కించుకుంది. తాజాగా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కొత్త సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు) ఇకపోతో తమిళ దర్శకుల్లో చేరన్ ఒకరు. కేఎస్ రవికుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతడు.. 1997లో భారతి కన్నమ్మ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వెట్రికొడి గట్టి, ఆటోగ్రాఫ్, తవమాయ్ తవమిరిందు తదితర చిత్రాలు తీశారు. తెలుగులో రవితేజతో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' సినిమా తీసింది ఈ డైరెక్టరే. 2017 తర్వాత దర్శకత్వానికి విరామం ఇచ్చిన ఇతడు.. దాదాపు ఆరేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాడు. ఈగ' చిత్రంలో విలన్ పాత్ర చేసిన ఆకట్టుకున్న సుదీప్ హీరోగా చేరన్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ఇందులోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించనుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!) View this post on Instagram A post shared by Sathya Jyothi Films (@sathyajyothifilms) -
విజయ్ సేతుపతితో సినిమా చేయడం సాధ్యం కాదు: డైరెక్టర్
భారతి కన్నమ్మ, దేశీయ గీతం, వెట్రికొడిగట్టు, పాండవర్ భూమి, సొల్లమరంద కథా, ఆటోగ్రాఫ్, తవమా య్ తవమిరుందు వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాల దర్శకుడు, వీటిలో పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన దర్శక నటుడు చేరన్. అయితే ఇటీవల ఆయన నటించిన, దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు నిరాశ పరచడంలో మళ్లీ తన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారు. కాగా ఆ మధ్య నటు డు విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తానని ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియ రాలేదు. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు చేరన్ను విజయ్ సేతుపతితో చేసే చిత్రం ఏమైందన్న మీడియా ప్రశ్నకు ఆ చిత్రాన్ని ఇకపై చేయటం వీలుకాదని బదులిచ్చారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన కోసం కథను మార్చాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం విజయ్ సేతుపతి చాలా బిజీగా ఉన్నారని, కాబట్టి ఆయనతో చిత్రం చేయడం ఇప్పట్లో అసాధ్యమని చేరన్ స్పష్టం చేశారు. -
షూటింగ్లో ప్రమాదం..8 కుట్లు పడినా సెట్‌కి వచ్చి..
చెన్నై : ఈ మధ్యకాలంలో షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరగడం తరుచూ చూస్తున్నాం. రిస్క్ అని తెలిసినా డూప్ లేకుండా నటిస్తూ కొందరు యాక్టర్స్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా నాలుగు జాతీయ అవార్డుల గ్రహీత, నటుడు, డైరెక్టర్ చేరన్ సినిమా షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. నంద పెరియాస్వామి దర్శకత్వంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో చేరన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో చేరన్ ఇంటి పైకప్పు నుంచి కాలు జారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్ ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు 8 కుట్లు పడినట్లు సమాచారం. అయితే తన వల్ల షూటింగ్ ఆగిపోవద్దని, వెంటనే హాస్పిటల్ నుంచి నేరుగా సెట్‌కి వచ్చి ఆయన షూటింగులో పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. -
‘రాజావుక్కు చెక్’ అంటున్న చేరన్
తమిళసినిమా: దర్శకుడు చేరన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నూతనోత్సాహంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన తాజాగా ప్రధానపాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం తిరుమణం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. చేరన్ ఈ చిత్రంతో పాటే రాజావుక్కు చెక్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి సాయిరాజ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు జయంరవి హీరోగా మళై చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. మధ్యలో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు వెళ్లిన ఈయన చాలా కాలం తరువాత రాజ్‌కుమార్ పేరు ముందు సాయిని చేర్చుకుని తమిళంలో చేస్తున్న చిత్రం రాజావుక్కు చెక్. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. రాజావుక్కు చెక్ కథను తయారు చేసుకున్న తరువాత ఇందులో ఏ హీరో అయితే బాగుంటుందన్న ఆలోచన వచ్చినప్పుడు ముందుగా మనసులో మెదిలింది చేరన్నేనన్నారు. కారణం కొన్ని విషయాలు చేరన్ లాంటి కొందరు నడివయసు నటులు చెబితేనే ప్రజల్లోకి చొచ్చుకుపోతాయన్నారు. అలాంటి ఒక సమస్యను ఆవిష్కరించే కథా చిత్రం రాజావుక్కు చెక్ అని చెప్పారు. అందుకే బాగా పాపులర్ అయిన చేరన్ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. తాము నమ్మినట్లుగానే ఆయన తనదైన శైలిలో ఈ చిత్రంలో నటించారని అన్నారు. ఇప్పటి వరకూ తమిళ తెరపై రానటువంటి కథాంశంతో రూపొందించిన చిత్రం రాజావుక్కు చెక్ అని అన్నారు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే చేరన్ తన తిరుమణం చిత్రాన్ని ప్రారంభించారని, తమ చిత్రంలో ఆయనకు ప్రత్యేక గెటప్ అవసరం అవడంతో తిరుమణం చిత్రం పూర్తి అయిన తరువాత తమ చిత్రాన్ని చేయాలని భావించామన్నారు. ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చెప్పారు. ఇందులో చేరన్‌కు జంటగా సరయూమోహన్, నందనవర్మ, ఒక ముఖ్య పాత్రలో సృష్టిడాంగే అంటూ ముగ్గురు హీరోయిన్లు నటించారని తెలిపారు. సుండాట్టం చిత్రాల్లో నటించిన ఇర్ఫాన్ ఇందులో విలన్‌గా నటించినట్లు చెప్పారు. మలయాళంలో ప్రముఖ నిర్మాతలుగా పేరు పొందిన సోమన్ పల్లాట్, ధామస్ కొక్కాట్ తమ పల్లాట్ కొక్కాట్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రాజావుక్కు చెక్ అని దర్శకుడు తెలిపారు. -
చేరన్‌కు విశాల్ హెచ్చరిక
తమిళసినిమా: సినీ దర్శక, నటుడు చేరన్ను నిర్మాతలమండలి అధ్యక్షుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ హెచ్చరించారు. విశాల్ ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమై నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన నిర్మాతలమండలి అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేరన్ సోమవారం సాయంత్రం నుంచి స్థానిక ఫిలించాంబర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయం వద్ద పోరాటం చేసిన విషయం తెలిసిందే. విశాల్ నిర్మాతల మండలికి చేసిందేమీ లేదని, ఇప్పుడు ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేయడం సినీ నిర్మాతలు మరింత బాధింపు గురవుతారని ఆరోపణలు గుప్పించారు. చేరన్ ఆరోపణలకు స్పందించిన విశాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తాను నడిగర్‌సంఘం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి ఆరోపణ వచ్చాయని, ఆ ఎన్నికల్లో గెలిచి, తమిళనిర్మాతల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని, ఇప్పుడు ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడూ అలాంటి ఆరోపణలే చేస్తున్నారని పేర్కొన్నారు. తాను చట్టపరంగా అన్ని విషయాలు చర్చించిన తరువాతే ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. దర్శకుడు చేరన్ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఆయన నిరాధార ఆ రోపణలతో ఉచిత ప్రచారం పొందే ప్రయత్రం చేస్తున్నారని విమర్శించారు. తాను నిర్మాతల మండలి ఎన్ని కల్లో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. చేరన్ ఇలాంటి దుష్ప్రచారాలతో కాలం వృథా చేసుకోరాదని హితవు పలికారు. ఇతడు ఇప్పటికీ మారకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాల్‌పై రాధారవి ఫైర్: కాగా చేరన్ పోరాటానికి నటి రాధిక శరత్‌కుమార్, సీనియర్ నటుడు, మాజీ నడిగర్ సంఘం కార్యదర్శి రాధారవి మద్దతు పలికారు.మంగళవారం ఉదయం వీరిద్దరూ నిర్మాతల మండలిలో చేరన్ చేస్తున్న పోరాటం చేస్తున్న చేరన్ కలిసి సంఘీభావాన్ని తెలిపారు.ఈ సందర్భంగా రాధారవి విశాల్‌ను దుర్భాషలతో తీవ్రంగా విమర్శించారు. -
దర్శకుడు చేరన్, కూతురికి సమన్లు
చెన్నై: సినీ దర్శకుడు చేరన్ ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినులకు చెక్కు మోసం కేసులో పరమకుడి కోర్టు సమన్లు జారీ చేసింది. వివరాల్లోకెళితే దర్శకుడు చేరన్ సీ2హెచ్ పేరుతో కొత్త సినిమాలను సీడీల రూపంలో అందించే సంస్థను ప్రారంభించారు. దీనికి తన కూతురు నివేద ప్రియదర్శినిని నిర్మాత, డైరెక్టర్ గా నియమించారు. కాగా ఈసీ2 హెచ్ తరపున పరమకుడి, పార్తిపనూర్, ముదుకుళత్తూర్, కముది, అభిరామం ప్రాంతాలకు ఏజెంట్‌గా పరమకుడి, మాధవన్ నగర్‌కు చెందిన పళముత్తునాదన్ను నియమించారు. అందుకుగాను ఆయన డిపాజిట్‌గా 80 వేల రూపాయల్ని చేరన్‌కు ఇచ్చారు. అయితే సీ2హెచ్ సంస్థ నిర్వాహణ అంత ఆశాజనకంగా లేకపోవడంతో పళముత్తునాథన్ డిపాజిట్ చేసిన డబ్బును లెక్క చూసి తిరిగి చెల్లించనున్నట్లు చేరన్,ఆయన కూతురు ఒప్పుకున్నారని సమాచారం. కాగా చెప్పినట్లుగానే ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో పళముత్తునాదన్కు వారు ఇచ్చారు. చెక్కును పళముత్తునాదన్ పరమకుడిలోని బ్యాంకులో వేయగా చెక్కు బౌన్స్ అయింది. ఇలా పలుమార్లు చెక్కు బౌన్స్ అవడంతో పళముత్తునాథన్ పరమకుడి కోర్టును ఆశ్రయించారు. చెక్కు మోసం పేరుతో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఇన్బకార్తికేయన్ దర్శకుడు చేరన్, ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినులకు ఈ నెల 30న కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేశారు. -
సినిమా రివ్యూ: ట్రాఫిక్
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, సూర్య (గెస్ట్ అప్పియరెన్స్) చెరన్, ప్రసన్న, పార్వతి మీనన్, ఇనియా నిర్మాత: రాధిక శరత్ కుమార్, లిసిన్ స్టిఫెన్ కథ: బాబీ సంజయ్ ఫోట్రోగ్రఫి: షెహనాద్ జలాల్ మ్యూజిక్: మేజో జోసెఫ్ దర్శకత్వం: షాహిద్ ఖాదర్ ఓ యాక్సిడెంట్ సంఘటనకు అనేక ట్విస్ట్ లను జోడించి ప్రకాశ్ రాజ్, రాధిక, శరత్ కుమార్, చెరన్, ప్రసన్నలతో కలిసి రూపొందించిన చిత్రం ట్రాఫిక్. తమిళంలో విజయవంతమైన చెన్నాయిల్ ఓరు నాల్ చిత్రం తెలుగులో 'ట్రాఫిక్'గా ఫిబ్రవరి 14న విడుదలైంది. అన్ని దానాలలో అవయవ దానం గొప్పదనే ఓ సందేశంతో రూపొందిన కథేంటో ముందు చూద్దాం. యాంకర్ గా రాణించాలనే కార్తీక్ (సచిన్) కు ఓ టెలివిజన్ చానెల్ లో అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన కార్తీక్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ గౌతమ్ కృష్ణ (ప్రకాశ్ రాజ్)ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుంది. కానీ కార్తీక్ ఓ యాక్సిడెంట్ కు గురై.. అతని బ్రెయిన్ డెడ్ అవుతుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గుండె మార్పిడి చికిత్స అవసరమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన కార్తీక్ తల్లి తండ్రులను గుండె మార్పిడికి ఒప్పించడంలో వైద్యులు సఫలమవుతారు. కోదాడలో విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న గౌతమ్ కృష్ణ కూతురుకు గంటన్నరలోనే గుండెను అమర్చాలి. స్వల్ప వ్యవధిలో గుండె మార్పిడి జరిగిందా? హైదరాబాద్ నుంచి కోదాడకు గంటన్నరలో ఎలా చేరుకున్నారు?. మార్గమధ్యంలో ఎదురైన సంఘటనలు ఏంటి? ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులను ఎలా అధిగమించారు? అనే ప్రశ్నలకు సమాధానమే ట్రాఫిక్ చిత్రం. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న గౌతమ్ కృష్ణ పాత్రలో ప్రకాశ్ రాజ్, ఆయన భార్యగా రాధిక, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా చెరన్ లు తమ పాత్రలను గొప్పగా పోషించారు. క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆలరించింది. విశ్లేషణ: పరిమితమైన సమయంలో గమ్యం చేరుకోవాలనే ఓ టార్గెట్ ను ప్రేక్షకులకు ముందే నిర్దేశించి.. ముందే కథలో లీనమయ్యేలా చేయడంలో సఫలమయ్యారు దర్శకులు షాహిద్ ఖాదర్. తొలి భాగంలో పాత్రలు వాటి స్వరూపాలను చక్కగా చిత్రీకరించిన దర్శకుడు.. రెండో భాగంలో తన నైపుణ్యానికి పనిచెప్పారు. హైదరాబాద్ - కోదాడ ప్రయాణంలో ఓ టెంపోను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, అడ్డంకులు సహజంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి గుండె మార్పిడి జరుగుతుందా లేదా అనే ఆసక్తిని రేకెత్తించడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. దర్శకుడి టేకింగ్ కు మేజో జోసెఫ్ బ్యాంక్ గ్రౌండ్ స్కోరు అదనపు అకర్షణగా మారింది. ప్రేక్షకుడికి చక్కటి ఫీల్ తోపాటు చిత్రాన్ని అందంగా, ఉత్కంఠను రేపే ఫొటోగ్రఫితో హెహనాద్ జలాల్ ఆకట్టుకున్నారు. రాధిక శరత్ కుమార్, లిసన్ స్టిఫెన్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇగో ఉన్న నటుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్, డ్రైవర్ పాత్రను పోషించిన చెరన్ లు అతి కీలకమైన పాత్రలు. వైద్యుడుగా ప్రసన్న కటుంబ వ్యవహారాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెరన్ జీవితం, కార్తీక్ ప్రేమకథ, కార్తీక్ తల్లితండ్రుల భావోద్వేగం, కూతురు రక్షించుకోవాలనే బాధతో గౌతమ్ కృష్ణ గా ప్రకాశ్ రాజ్ లాంటి అంశాలు, పలు కోణాలు ఈ కథకు మరింత బలాన్నిచ్చాయి. చక్కటి ఫీల్, భావోద్వేగం, ఓ సామాజిక నేపథ్యమున్న అంశాలను జోడించి నిర్మించిన ట్రాఫిక్ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూశామనే భావన కలిగిస్తుంది. ప్రస్తుతం వస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ మంచి చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులకు కేరాఫ్ అడ్రస్ ట్రాఫిక్ అని చెప్పవచ్చు. -
ప్రేమ కథల ఎక్స్‌పర్ట్‌కు లవ్ ఎఫెక్ట్