![Vishal Warning To Cheran - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/6/visgal.jpg.webp?itok=QThKHmrK)
తమిళసినిమా: సినీ దర్శక, నటుడు చేరన్‌ను నిర్మాతలమండలి అధ్యక్షుడు, నడిగర్‌సంఘం కార్యదర్శి విశాల్ హెచ్చరించారు. విశాల్ ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమై నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన నిర్మాతలమండలి అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేరన్ సోమవారం సాయంత్రం నుంచి స్థానిక ఫిలించాంబర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయం వద్ద పోరాటం చేసిన విషయం తెలిసిందే. విశాల్ నిర్మాతల మండలికి చేసిందేమీ లేదని, ఇప్పుడు ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేయడం సినీ నిర్మాతలు మరింత బాధింపు గురవుతారని ఆరోపణలు గుప్పించారు. చేరన్ ఆరోపణలకు స్పందించిన విశాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అందులో తాను నడిగర్‌సంఘం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి ఆరోపణ వచ్చాయని, ఆ ఎన్నికల్లో గెలిచి, తమిళనిర్మాతల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని, ఇప్పుడు ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడూ అలాంటి ఆరోపణలే చేస్తున్నారని పేర్కొన్నారు. తాను చట్టపరంగా అన్ని విషయాలు చర్చించిన తరువాతే ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. దర్శకుడు చేరన్ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఆయన నిరాధార ఆ రోపణలతో ఉచిత ప్రచారం పొందే ప్రయత్రం చేస్తున్నారని విమర్శించారు. తాను నిర్మాతల మండలి ఎన్ని కల్లో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. చేరన్ ఇలాంటి దుష్ప్రచారాలతో కాలం వృథా చేసుకోరాదని హితవు పలికారు. ఇతడు ఇప్పటికీ మారకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విశాల్‌పై రాధారవి ఫైర్: కాగా చేరన్ పోరాటానికి నటి రాధిక శరత్‌కుమార్, సీనియర్ నటుడు, మాజీ నడిగర్ సంఘం కార్యదర్శి రాధారవి మద్దతు పలికారు.మంగళవారం ఉదయం వీరిద్దరూ నిర్మాతల మండలిలో చేరన్ చేస్తున్న పోరాటం చేస్తున్న చేరన్ కలిసి సంఘీభావాన్ని తెలిపారు.ఈ సందర్భంగా రాధారవి విశాల్‌ను దుర్భాషలతో తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment