
కేజీఎఫ్ సినిమాతో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి వేరే లెవల్ క్రేజ్ వచ్చింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి కూడా మంచి ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే క్రేజీ ఛాన్సులు కొట్టేస్తోంది. తాజాగా సిద్ధు కొత్త మూవీ 'తెలుసు కదా'లో అవకాశం దక్కించుకుంది. తాజాగా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కొత్త సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు)
ఇకపోతో తమిళ దర్శకుల్లో చేరన్ ఒకరు. కేఎస్ రవికుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతడు.. 1997లో భారతి కన్నమ్మ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వెట్రికొడి గట్టి, ఆటోగ్రాఫ్, తవమాయ్ తవమిరిందు తదితర చిత్రాలు తీశారు. తెలుగులో రవితేజతో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' సినిమా తీసింది ఈ డైరెక్టరే. 2017 తర్వాత దర్శకత్వానికి విరామం ఇచ్చిన ఇతడు.. దాదాపు ఆరేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాడు.
ఈగ' చిత్రంలో విలన్ పాత్ర చేసిన ఆకట్టుకున్న సుదీప్ హీరోగా చేరన్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ఇందులోనే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మించనుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment