ఓటీటీలోకి మరో డిఫరెంట్ సిరీస్.. స్టార్ దర్శకుడికి ఇదే తొలిసారి | Director Cheran Journey Web Series Release Date And Trailer | Sakshi
Sakshi News home page

ఓటీటీ ఎం‍ట్రీ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు.. సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే?

Published Sat, Jan 6 2024 8:03 AM | Last Updated on Sat, Jan 6 2024 8:19 AM

Director Cheran Journey Web Series Release Date And Trailer  - Sakshi

మరో స్టార్ డైరెక్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈయన తీసిన తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, సిరీస్ విశేషాలను పంచుకున్నారు. ఇంతకీ ఈ సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది? సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!)

రవితేజ కెరీర్‌లో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీన్ని తీసింది దర్శకుడు చేరన్. స్వతహాగా తమిళంలో సినిమాలు తీసే ఇతడు.. ఈ మధ్యే హీరోగానూ మారాడు. ఇప్పుడు ఓటీటీల్లోకి కూడా అడుగుపెట్టేశాడు. 'చేరన్స్ జర్నీ' పేరుతో తీసిన సిరీస్.. ఈ జనవరి 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. చూస్తుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది.

9 ఎపిసోడ్స్‌తో తీసిన ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఓ పెద్ద కంపెనీకి బాస్ (శరత్ కుమార్), ఓ ఉద్యోగం కోసం ఐదుగురిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇందులో నలుగురు అబ్బాయిలు- ఓ అమ్మాయి ఉంటుంది. వీళ్లకు రకరకాల పరీక్షలు పెట్టి చివరకు ఒక్కరిని ఎంపిక చేస్తారు? ఈ క్రమంలోనే వీళ్లు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అసలేంటి ఉద్యోగం? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఓటీటీనే కాబట్టి తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసే అవకాశముంది.

(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement