
చిత్ర పరిశ్రమలో హీరోలకే అత్యధిక పారితోషికం అంటూ చాలా మంది టాప్ హీరోయిన్లు గగ్గోలు పెడుతుండేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందనిపిస్తోంది. హీరోయిన్లు కూడా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒక చిత్రం కోసం హీరోలు ఏడాది, రెండేళ్లు శ్రమిస్తుంటే, హీరోయిన్లు మాత్రం ఒక్కో చిత్రానికి మహా అయితే రెండు నెలలు శ్రమిస్తారు.

అయినప్పటికీ దక్షిణాది హీరోయిన్లలో నయనతార, త్రిష వంటి వారు ఇప్పుడు రూ.12 నుంచి రూ.14 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఒక బాలీవుడ్ నటి ముందు వీరు పొందుతున్న పారితోషికం స్వల్పమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనేగా మీ ఆసక్తి. ఇంకేవరు బాలీవుడ్ ఐటం సాంగ్ క్వీన్ ఊర్వశీ రౌతేలా.

ఈ భామ బాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాదిలోనూ దుమ్మురేపుతున్నారు. ఈ మధ్య తమిళంలో ది లెజండ్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు.

లెజెండ్ శరవణన్‌కు జంటగా నటించి అత్యధిక పారితోషికం పుచ్చుకున్నారు.

నిజానికి ఈ చిత్రంలో నటించే అవకాశం ముందుగా నయనతారకు వచ్చిందనీ, ఆమె ఎన్ని కోట్లు పారితోషికంగా చెల్లించినా ఆ చిత్రంలో నటించేది లేదని కచ్చితంగా చెప్పడంతో ఈమెకు ఇచ్చే పారితోషికాన్ని ఊర్వశీ రౌతేలాకు ఇచ్చి ఆమెను నటింపజేసినట్లు ప్రచారం హోరెత్తింది.

కాగా ఐటమ్ సాంగ్స్‌కు రెడీ అనే ఈమె ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో మూడు నిమిషాల పాటలో నటించడానికి ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు ప్రచారం జరిగింది.

ఏదేమైనా ఈ అమ్ముడు హీరోలకు ధీటుగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.




