బీటెక్‌ కుర్రాడు.. బిగ్‌బాస్‌ ద్వారా ఎంత సంపాదించాడంటే? | Bigg Boss Telugu 7 Finale: Amardeep Chowdary 15 Weeks Remuneration Details - Sakshi
Sakshi News home page

Amardeep Chowdary: బిగ్‌బాస్‌ 7 రన్నరప్‌.. ఎన్ని లక్షలు సంపాదించాడంటే?

Published Sun, Dec 17 2023 11:15 PM | Last Updated on Mon, Dec 18 2023 1:59 PM

Bigg Boss Telugu 7: Amardeep Chowdary Remuneration Details - Sakshi

ప్రతి సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు ఒకరుంటారు. అలా ఈ సీజన్‌లో అమర్‌దీప్‌ ఉన్నాడు. షో ప్రారంభంలో తడబడ్డా తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులపాలయ్యాడు. అంతేకాకుండా శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారన్నది అమర్‌ విషయంలో నిజమైంది.

మెంటల్‌ టార్చర్‌ను చిరునవ్వుతో భరించాడు
కొన్నిసార్లు స్నేహితులు సైతం తనను పట్టించుకోలేదు. గురువుగా భావించే శివాజీ అయితే అమర్‌ను అనరాని మాటలన్నాడు.. మెంటల్‌ టార్చర్‌ పెట్టాడు. అయినా అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్‌ ప్రాబ్లమ్‌ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్‌ రన్నరప్‌గా నిలిచాడు.

వారానికి రూ.2.5 లక్షలు
మరి ఈ అనంతపురం కుర్రాడు ఎంత సంపాదించాడో తెలుసా? షోలోకి రావడానికి ముందే సీరియల్స్‌ ద్వారా బోలెడంత గుర్తింపు ఉంది. కనుక అమర్‌దీప్‌కు భారీగానే డబ్బులు ఆఫర్‌ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట! ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుంది.

చదవండి: బిగ్‌బాస్‌ 7 విజేతగా ప్రశాంత్‌.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement