ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. రొటీన్ కమర్షియల్ కథల్ని చాలావరకు పక్కనబెట్టి సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ తీస్తున్నారు. అలా యంగ్ హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమా 'గామి'. దాదాపు ఆరేళ్ల పాటు ఈ మూవీ కోసం పనిచేసిన విశ్వక్.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకు కారణమేంటనేది కూడా చెప్పాడు.
విశ్వక్ సేన్.. అఘోరా పాత్రలో నటించిన సినిమా 'గామి'. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. హాలీవుడ్ సినిమాల రేంజులో ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్)
విశ్వక్ సేన్ ఇంకా హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోని టైంలో అంటే 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్రౌడ్ ఫండింగ్ విధానంలో కేవలం రూ.25 లక్షల పెట్టుబడితో మాత్రమే ఈ మూవీ తీయాలనేది ప్లాన్. కానీ దాదాపు ఆరేళ్ల పాటు అడపాదడపా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే పనిచేసినందుకు డబ్బులు తీసుకుంటే.. మూవీ బడ్జెట్ పెరిగిపోద్ది అనే ఉద్దేశంతోనే తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్‌లో చెప్పాడు.
అయితే 'గామి' కోసం రెమ్యునరేషన్ తీసుకోనప్పటికీ.. రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకుంటాడని సగటు ప్రేక్షకుడు మాట్లాడుకుంటున్నాడు. ఏదేమైనా ఆరేళ్ల పాటు ఓ సినిమా కోసం కష్టపడి పారితోషికం తీసుకోకపోవడమనేది ఆసక్తకర విషయమే. మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ)
Comments
Please login to add a commentAdd a comment