
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' మూవీతో హిట్ కొట్టాడు. డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇక్కడ కూడా ట్రెండింగ్‌లో ఉంటూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే థియేటర్లలో 'సలార్' చూస్తున్నప్పుడు గమనించని చాలా విషయాలు.. ఓటీటీలోకి వచ్చాక బయటపడ్డాయి. అలా ఇప్పుడు ప్రభాస్ సెట్ చేసిన ఓ విచిత్రమైన రికార్డ్ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: కుమారి ఆంటీ పుడ్ బిజినెస్ క్లోజ్.. సాయం చేస్తానంటున్న తెలుగు హీరో)
'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి అభిమానులు చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ వచ్చారు. 'సాహో' మూవీ కొంతలో కొంత పర్వాలేదనిపించింది కానీ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఫ్లాప్స్‌గా నిలిచాయి. దీంతో అందరూ 'సలార్' మీదే ఆశలు పెట్టుకున్నారు. అలా గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై ఇక్కడ కూడా రచ్చ లేపుతోంది.
అయితే 'సలార్'లో ప్రభాస్ ఫైట్స్ అదరగొట్టినప్పటికీ.. సినిమా మొత్తం కలిపి కేవలం 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పాడు. మరోవైపు ఈ చిత్రంలో నటించినందుకు గానూ రూ.125 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్ వినిపించింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూస్తే మాత్రం డార్లింగ్ హీరో.. సెకనుకు రూ.80, 64,516 సంపాదించినట్లే. అంటే నిమిషానికి పదులు కోట్లు అందుకున్నట్లే. మనదేశంలో ఇలా సెకనుకు లక్షలు.. నిమిషానికి కోట్లు సంపాదించిన రికార్డు ప్రభాస్‌దే.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)
Prabhas Dialogue time in Salaar (sped up)
Roughly 4 minutes with dialogue gaps and 2:35 min without gaps... https://t.co/aHPhd30Mp5 pic.twitter.com/bxTclXjMcA— Lok (@TeluguOchu) January 21, 2024