'మహానటి' కీర్తి సురేశ్ తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోయింది. పేరుకే మలయాళీ గానీ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసింది. రీసెంట్‌గా ఆంటోని తట్టిళ్ అనే బిజినెస్‌మ్యాన్ పెళ్లి చేసుకుంది. మరోవైపు ఈమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'.. వచ్చే వారం క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఈ మూవీ కోసం డబుల్ రెమ్యునరేషన్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.
ప్రముఖ నిర్మాత సురేశ్, ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేశ్.. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ ఏడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి'లో కారుకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎంటర్‌టైన్ చేసింది. ఈమె నటించిన 'బేబీ జాన్' అనే హిందీ మూవీలో నటించింది. తమిళ సినిమా 'తెరి' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: రూ.10 టికెట్‌లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)
ఒరిజినల్ సినిమాలో సమంత కనిపించిన పాత్రలో ఇప్పుడు కీర్తి సురేశ్ నటించింది. సౌత్‌లో నటిస్తే రూ.2 కోట్లు ఈమెకు ఇస్తారు. కానీ 'బేబీ జాన్'లో నటించినందుకుగానూ రూ.4 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. బహుశా అందుకేనేమో గ్లామర్ విషయంలోనూ తగ్గేదే లే అన్నట్లు పాటల్లో కనిపించింది!
ఇదే సినిమాలో నటించిన మిగతా నటీనటులు రెమ్యునరేషన్ విషయానికొస్తే హీరో వరుణ్ ధావన్‌కి రూ.15 కోట్లు పైనే ఇచ్చారట. విలన్‌గా చేసిన జాకీ ష్రాఫ్‌కి కోటిన్నర, మరో హీరోయిన్‌గా చేసిన వామికా గబ్బికి కోటి రూపాయలు, కీలక పాత్ర చేసిన సన్యా మల్హోత్రాకు రూ.40 లక్షల పారితోషికం ఇచ్చారట. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇతడి శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment