బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించాడు. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ ఓ స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. కేవలం ఐదేళ్లలోనే రూ.1 కోటి తీసుకునే స్థాయి నుంచి ఏకంగా రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఫస్ట్ సినిమాకు ఎంతంటే?
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన కార్తీక్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని గురించి హీరో మాట్లాడుతూ.. నా ఫస్ట్ మూవీ ప్యార్ కా పంచనామాకు నేను కోటి రూపాయలు తీసుకోలేదు. నా పారితోషికం కనీసం లక్షల్లో కూడా లేదు. కేవలం రూ.70 వేలు మాత్రమే. పైగా అందులో టీడీఎస్ కట్ చేసుకుని రూ.63,000 ఇచ్చారు అని బదులిచ్చాడు.
ఆ సినిమా తర్వాతే..
పోనీ.. 2018లో వచ్చిన సోనూకీ టిటు కి స్వీటీ సినిమాకు రూ.1 కోటి అందుకున్నావా? అని యాంకర్ రాజ్ శమానీ అడగ్గా.. ఆ చిత్రానికి కూడా అంత పెద్ద మొత్తం తీసుకోలేదని తెలిపాడు. సోనూ.. సినిమా తర్వాతే కాస్త ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాను. కానీ ఈ ట్యాక్స్‌లు నాకు రావాల్సిన డబ్బును కొంత హరిస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చేతిలో చందూ చాంపియన్, భూల్ భులయ్యా 3 సినిమాలున్నాయి.
చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment