రెమ్యునరేషన్‌ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే! | Trisha Hikes Her Remuneration After Ponniyin Selvan Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Trisha: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!

Published Sun, Mar 31 2024 9:03 AM | Last Updated on Sun, Mar 31 2024 1:36 PM

Trisha Hikes Her Remuneration - Sakshi

తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్‌స్టార్‌ నయనతారను దాటేసి నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్‌వన్‌ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్‌ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్‌ పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్‌ పడిపోయింది. ఒక టైమ్‌లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్‌ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్‌ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. అంతే త్రిష సెకండ్‌ ఇన్నింగ్‌కు ఆ చిత్రంతోనే బీజం పడింది.

ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్‌ సరసన థగ్స్‌ లైఫ్‌, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్‌, నివిన్‌బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్‌ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్‌లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు.

కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్‌ సరసన నటిస్తున్న థగ్స్‌ లైఫ్‌ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్‌వన్‌ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement