
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అందుకున్నాడు తేజ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ‘హను-మాన్’ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ‘హను-మాన్’ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.. రికార్డు సృష్టించింది.
ఇక హను-మాన్ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్‌ని పెంచేశాడట.
పారితోషికం అమాంతం పెంచేసిన తేజ
సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇక హను-మాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేశాడట. హను-మాన్ రిలీజ్ తర్వాత తేజతో సినిమా చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారట. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. హను-మాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్‌గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట.
మరో హిట్ వస్తేనే..
హను-మాన్‌తో తేజ సజ్జ స్థాయి పెరిగింది.అందులో అనుమానమే లేదు. అయితే ఈ చిత్రం ద్వారా తేజ కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మకు పేరొచ్చింది. అతని పని తీరు పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కథను అద్భుతంగా తీర్చి దిద్దాడని మెచ్చుకున్నారు. ఈ చిత్రం అతని కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. తేజ సజ్జని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా తన తదుపరి సినిమాలపై ఉంటుంది. అతని నుంచి వచ్చే సినిమాలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా తేజ సజ్జ కథలను ఎంచుకోకపోతే కెరీర్‌కే ముప్పు వస్తుంది. రాబోయే సినిమా హిట్ అయితే తేజ సజ్జ కెరీర్‌కు కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment