Kalki 2898 AD: దీపికకు భారీ రెమ్యునరేషన్‌.. కెరీర్‌లోనే తొలిసారి! | Deepika Padukone Charge Huge Remuneration For Prabhas Kalki 2898 AD Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: దీపికకు భారీ రెమ్యునరేషన్‌.. అన్ని కోట్లా?

Published Sun, Feb 11 2024 9:18 AM | Last Updated on Sun, Feb 11 2024 12:30 PM

Deepika Padukone Charge Huge Remuneration For Kalki 2898 AD - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. ఒకవైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరస పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బీజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికే ఈ బ్యూటీ నటించిన పఠాన్‌, జవాన్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఈ మధ్యే ఫైటర్‌ మూవీతో ప్రేక్షకులను అలరించింది. 

ప్రస్తుతం ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నారు.ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్‌ ఫ్యూచరిస్ట్‌ ఫిల్మ్‌ ఇది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికాతో పాటు కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నటించేందుకు దీపికా భారీగానే రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట.

ఫిల్మ్‌ సర్కిల్‌లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం.. ఈ మూవీ కోసం దీపికాకు రూ.20 కోట్ల పోరితోషికం అప్పజెప్పారట మేకర్స్‌. దీపికా కెరీర్‌లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్‌ అట. గతంలో ఒక్కో సినిమాకు రూ. 12-15 కోట్ల వరకు పారితోషికం తీసుకునేదట. ఈ చిత్రాకి ఎక్కువ కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతో రూ.20 కోట్ల అడిగిందట. కీలక పాత్ర కావడంతో నిర్మాతలు కూడా దీపికా డిమాండ్‌కి ఓకే చెప్పారని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.  వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement