నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్? | Prabhas No Remuneration For Kannappa Movie | Sakshi
Sakshi News home page

Prabhas: పాన్ ఇండియా సినిమా.. కానీ ప్రభాస్‌కి రెమ్యునరేషన్ లేదా?

Published Wed, May 15 2024 11:44 AM | Last Updated on Wed, May 15 2024 12:50 PM

Prabhas No Remuneration For Kannappa Movie

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'సలార్'తో హిట్ కొట్టాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. దీని తర్వాత 'రాజా సాబ్', 'సలార్ 2'కి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. ఏంటి సంగతి? ఆ సినిమా ఏది?

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)

పైన చెప్పిన సినిమాలతో పాటే ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. ఇందులో నటిస్తున్నందుకు గానూ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట.

ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్‌తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'కన్నప్ప' టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిబట్టి సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.

(ఇదీ చదవండి: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement