స్ట్రాంగ్‌ ఉమెన్‌.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్‌! | Bigg Boss Telugu 8 Yashmi Gowda Remuneration For 12 Weeks In BB House, Know Her Elimination Reasons | Sakshi
Sakshi News home page

అదే యష్మి కొంపముంచింది.. 12 వారాల్లో ఎంత సంపాదించిందంటే?

Published Sun, Nov 24 2024 10:29 PM | Last Updated on Mon, Nov 25 2024 4:20 PM

Bigg Boss Telugu 8: Yashmi Gowda Remuneration, Elimination Reasons

యష్మి గౌడ.. స్ట్రాంగ్‌ ఉమెన్‌, టాప్‌ 5 కంటెస్టెంట్‌ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్‌లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్‌లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్‌ ట్యాగ్‌ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్‌ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.

సంచాలక్‌గా వరస్ట్‌
ప్లేయర్‌గా బెస్ట్‌ అనిపించుకున్నా సంచాలక్‌గా వరస్ట్‌ గేమ్స్‌ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్‌పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్‌ఫాల్‌ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్‌ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్‌ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.

నిఖిల్‌ చుట్టూ గేమ్‌
తన కోసం గేమ్‌ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్‌ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్‌లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్‌లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్‌ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్‌కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. 

పారితోషికం ఎంత?
చివరకు తన ఏడుపు కూడా ఫేక్‌ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్‌గా ఈ వారం ఎలిమినేట్‌ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement