చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ | Bigg Boss 8 Telugu October 19th Full Episode Review And Highlights: BB Time Headlines, Manikanta Gets Emotional | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Oct 19th Highlights: మాటలో పులి- ఆటలో పిల్లి.. యష్మిపై మనసు పారేసుకున్న గౌతమ్‌! ఇంట్లో నుంచి పోతానంటూ మణి ఏడుపు

Published Sat, Oct 19 2024 11:34 PM | Last Updated on Sun, Oct 20 2024 6:10 PM

Bigg Boss Telugu 8, Oct 19th Full Episode Review: BB Time Headlines

హౌస్‌మేట్స్‌ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్‌ పెట్టాడు. మరోవైపు హౌస్‌లో గౌతమ్‌ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్‌ అంటున్నాడు. అటు బిగ్‌బాస్‌ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్‌ 19) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..



వెళ్లిపోతా..
ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్‌ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

యష్మిపై గౌతమ్‌ క్రష్‌
అటు గౌతమ్‌.. 'నేను సింగిల్‌, నీపై నాకు క్రష్‌ ఉంది..  ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్‌లా ఉందాం. మన మధ్య బాండింగ్‌ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్‌' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్‌ హెడ్‌లైన్స్‌ అని ఓ గేమ్‌ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్‌లైన్స్‌ను బోర్డ్‌పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్‌ అవుతుందన్నది హౌస్‌మేట్స్‌ చెప్పాలి. 

నిన్న హీరో- ఈరోజు జీరో
అలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్‌ గౌతమ్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్‌, గౌతమ్‌ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్‌.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్‌కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్‌ కరెక్ట్‌గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్‌- ఇప్పుడు ఫ్లవర్‌లా మారిపోయిందన్నారు.

ఆట కంటే నాకు నేనే ముఖ్యం
పృథ్వీకి.. 'కింగ్‌ ఆఫ్‌ డిస్‌రెస్పెక్ట్‌- వాంట్స్‌ రెస్పెక్ట్‌ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్‌ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్‌ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్‌తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్‌ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.

అశ్వత్థామ 3.0
ఇక నామినేషన్స్‌లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్‌ నామినేషన్‌ చేయడాన్ని నాగ్‌ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్‌కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్‌ వేస్తా అన్న హెడ్డింగ్‌ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్‌ యానివర్సరీ విషెస్‌ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్‌ ఎమోషనలయ్యాడు. ఇ​క​ గౌతమ్‌ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్‌ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్‌ యష్మికి కాస్త సూట్‌ అవుతుందన్నారు. 

ఆటలో వీక్‌- డ్రామాలో పీక్‌
తర్వాత నాగ్‌.. ప్రేరణ, తేజను నాగ్‌ సేవ్‌ చేశాడు. 'ఆటలో వీక్‌- డ్రామాలో పీక్‌' హెడ్డింగ్‌ మణికంఠకు సెట్‌ అవుతుందని హౌస్‌మేట్స్‌ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్‌లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్‌. నాకు నేనే వీక్‌ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్‌ ఎలా ఉందో చూద్దామని నాగ్‌ అతడిని కూర్చోబెట్టాడు.

మత్తు వదలరా..
తేజకు హౌస్‌ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్‌ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్‌ ఇచ్చారు. మెహబూబ్‌.. ఈ సీజన్‌కు ఫ్లాప్‌ చీఫ్‌ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్‌గా సెట్‌ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్‌ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.

మాటలో పులి- ఆటలో పిల్లి
ఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్‌ నా సరికొత్త ఆట', 'వీకెండ్‌లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్‌లైన్స్‌  కరెక్ట్‌గా సరిపోయాయన్నారు. నబీల్‌.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్‌ ముగిసింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement