
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో అన్నీ అన్‌లిమిటెడ్ అంటూనే కొన్ని మాత్రం గెలిచి సంపాదించుకోవాలని ట్విస్ట్ ఇచ్చాడు. అందులో రేషన్ ఒకటి. ఇంటిసభ్యుల కడుపు నిండాలంటే వారే కష్టపడి టాస్కులు గెలిచి రేషన్ గెలిచి వండుకుని తినాలి. లేదంటే పస్తులుండాల్సిందే!

ఆకలి పోరాటం
ఇందుకోసం టీముల మధ్య పోటీ పెట్టాడు బిగ్‌బాస్. మొదట లెమన్ పిజ్జా టాస్క్ పెట్టారు. ఇందులో యష్మి టీమ్ గెలిచినట్లు సమాచారం. తర్వాతి ఛాలెంజ్‌లో కందిపప్పు తెమ్మనగానే సీత పరుగెత్తుకుంటూ వెళ్లి తెచ్చేసింది. నెక్స్ట్ టమాట బుట్టలో ఒక యాపిల్‌ను తీయండనగానే మణికంఠ దాన్ని కనిపెట్టి క్యాచ్ చేశాడు. ముచ్చటగా మూడో గేమ్‌లో పావుకిలో మరమరాలు తేవాలన్నాడు బిగ్‌బాస్.

మణికంఠ వర్సెస్ యష్మి
కరెక్టుగా 250 గ్రాములే తేవడానికి వీళ్లేమైనా కిరాణా షాపులో పని చేశారా? దీంతో కాస్త అటూఇటుగా తీసుకొచ్చారు. కానీ సంచాలకురాలు యష్మి కరెక్ట్‌గా తేలేదంటూ ఇద్దర్నీ అనర్హులుగా ప్రకటించింది. పావుకిలోకు దగ్గర్లో (290 గ్రాముల మరమరాలు) తెచ్చిన తాను గెలిచినట్లే కదా అని మణికంఠ వాదించాడు. అందుకు యష్మి ఒప్పుకోలేదు. మొత్తానికి ఈ గేమ్‌లో నైనిక టీమ్ గెలిచినట్లు తెలుస్తోంది.

చాలా బాధగా ఉంది బిగ్‌బాస్
అందరికంటే చిన్నదైన నిఖిల్ టీమ్ ఎందులోనూ గెలవకపోవడంతో ఈ వారమంతా నో రేషన్ అని చెప్పాడట బిగ్‌బాస్. అలాగని పస్తులుంచకుండా.. కేవలం రాగి పిండి పంపించి దానితోనే అడ్జస్ట్ అయిపోమన్నాడట! కేవలం రాగిముద్దతోనే కడుపు నింపుకుని టాస్కులు ఆడాలంటే కష్టమే కదా! అందుకే సీత.. ఫుడ్ గురించి కొట్టుకోవడం చాలా బాధగా ఉంది. వారికి కూడా ఆహారాన్ని ఇవ్వండని బిగ్‌బాస్‌ను అభ్యర్థించింది. అటు సోనియా మాత్రం.. నిఖిల్ కడుపు మాడుతే తాను భరించలేనంటూ ఏడ్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment