
అందరూ ఏదో పగబట్టినట్లు ఒక్కరినే నామినేట్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి బాధనిపించడం ఖాయం. కానీ అంత బాధలోనూ నా గతం మీకు తెలీదంటూనే తన చరిత్రనంతా మళ్లీ చదివి వినిపించాడు నాగమణికంఠ. కష్టాలన్నీ తనకు మాత్రమే ఉన్నాయంటూ ఓరకంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
సింపతీ గేమ్
దీంతో బిగ్‌బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఓదార్చాడు. చూస్తుంటే ఇతడు పల్లవి ప్రశాంత్‌లా సింపతీ గేమ్ ఆడి గెలుద్దామనుకుంటున్నాడని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నాడు. మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సోనియా తనకు తానే ఆడపులి అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చేసుకుంది.
సెల్ఫ్ డబ్బా..
ఈ మాట జనాలు చెప్పుంటే బాగుండేది కానీ మరీ రెండు రోజుల్లోనే తనను తాను పొగుడుకోవడం చూసిన బిగ్‌బాస్ ప్రియులు ఇది సెల్ఫ్ డబ్బా అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లో బిందుమాధవిలా ఫీలవుతుందని సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment