![Bigg Boss Telugu 8: Naga Manikanta Happily Swap with Aditya Om](/styles/webp/s3/article_images/2024/09/27/mani-aditya.jpg.webp?itok=iPwlRDsv)
గ్రూప్ గేమ్స్ అంటూ నిఖిల్‌ను మొదటిరోజే విమర్శించిన సోనియా.. ఇప్పుడు అతడితోనే జతకట్టి గేమ్ ఆడుతోంది. పృథ్వీ, నిఖిల్, సోనియా.. ఈ ముగ్గురూ ఓ బ్యాచ్. వీళ్ల మధ్యలోకి ఎవరూ వెళ్లలేరు. వెళ్లినా ఉండలేరు. నాగమణికంఠ విషయంలో ఇదే జరిగింది.
శక్తి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నప్పుడు సోనియా, పృథ్వి, యష్మి.. మణి పేరు సూచించారు. ఆల్‌రెడీ ఫలితం నిర్ణయించుకున్నాక, తననే మెడపట్టి గెంటేయాలని ఫిక్సయ్యాక వాదించడం అనవసరమని మణి తనే త్యాగం చేస్తానన్నాడు. పోరాటానికి బదులు త్యాగానికే మొగ్గు చూపాడు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/bb_5.jpg)
(ఇది చదవండి: దేవర మూవీ రివ్యూ)
తానేం కావాలని త్యాగం చేయలేదని మణి అనగానే శక్తి టీమ్ ఒంటికాలిపై లేచింది. అబద్ధాలు ఆడుతున్నావంటూ మణిపై విరుచుకుపడింది. ఓరకంగా చెప్పాలంటే మెంటల్ టార్చర్ చూపించింది. నిజానికి ఈ టీమ్‌లోకి వెళ్లడం అతడికి ఇష్టమే లేదు.
అయితే తాజాగా బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. టీమ్ నుంచి స్వాప్ అయ్యే ఆప్షన్ కల్పించాడట. ఆ గోల్డెన్ బ్యాండ్ అందుకున్న మణి కాంతార టీమ్‌లోకి వెళ్లగా.. తన స్థానంలో ఆదిత్యను శక్తి టీమ్‌లో పంపించాడు.
Comments
Please login to add a commentAdd a comment