
బిగ్‌బాస్ హౌస్‌లో చిన్నదానికి, పెద్దదానికి గొడవలు, ఏడుపులు సహజమే! ఇవి కోడిగుడ్డు టాస్క్‌లోనూ జరిగాయి. ఎగ్స్ దొంగిలించడం, కాపాడుకునే క్రమంలో శక్తి, కాంతార టీమ్స్ మధ్య చాలా ఫైటింగ్సే జరిగాయి. తనమీద ఇద్దరు అబ్బాయిలు పడ్డారని యష్మి చెప్పగా.. పృథ్వీ లఫూట్ గేమ్ స్టార్ట్ చేశాడని, బిగ్‌బాస్ హౌస్‌లోనే అతడొక వరస్ట్ ప్లేయర్ అని అభయ్ అభిప్రాయపడ్డాడు.

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన మణికంఠ
ఒక రౌండ్‌లో శక్తి టీమ్ లీడ్‌లో ఉండటంతో కాంతార టీమ్‌లో నుంచి ఒకర్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వాళ్లు మణికంఠను సైడ్ చేశారు. తనను ఆట నుంచి పక్కకు తప్పించడంతో మణికంఠ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఒక మూలకు వెళ్లి గోడకు తల ఆనించి బోరుమని ఏడ్చాడు. అతడిని ఓదార్చేందుకు అభయ్ ప్రయత్నించగా.. నా పెళ్లాంబిడ్డలు నాక్కావాలంటే షో విన్ అవ్వాలని మణి ఏడుస్తూనే ఉన్నాడు.
షో గెలవాలి
నిన్ను నమ్ముకుని బయట ఇద్దరున్నారని అభయ్ అంటుంటే ఎవరూ లేరు, వాళ్లు నా లైఫ్‌లోకి రావాలంటే షో గెలవాలి అని కంటతడి పెట్టుకున్నాడు. పర్సనల్స్, గేమ్ రెండూ వేరని చెప్పే మణి.. ఇలా ప్రతిసారి తన ఫ్యామిలీ గురించి చెప్పడం చూసి విసుగెత్తిన జనాలు సింపతీ స్టార్ట్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.