హౌస్‌మేట్స్‌ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చిన బిగ్‌బాస్ తర్వాత చీఫ్ కంటెండర్ కోసం మరో గేమ్ పెట్టాడు. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరు చీఫ్ అయ్యారు? మళ్లీ ఎలాంటి రభస జరిగిందనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
మార్నింగ్ మస్తీ..
బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ఉదయాన్నే కాస్త ఫన్ గేమ్ ఆడించాడు. కలర్.. కలర్.. విచ్ కలర్? అంటూ చిన్నపిల్లల ఆట ఆడించాడు. మధ్యమధ్యలో హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా చేయించాడు. అనంతరం సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ వెల్లడించాడు. ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించాడు. ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీమ్ నుంచి ఒకర్ని నేరుగా చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ చేయమని బిగ్‌బాస్ ఆదేశించాడు.
ఏడ్చిన యష్మి, పృథ్వీ
దీంతో యష్మి, పృథ్వీ.. తాను కంటెండర్ అవుతానంటే తాను అవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ.. నువ్వు మణికంఠను అబ్బాయి కాదని కామెంట్ చేయలేదా? అని నెగెటివ్ ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మతోడు అలా అనలేదని దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైకి కఠినగా కనిపించే ఇద్దరూ కంటతడి పెట్టుకోవడంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు.
పప్పీ గేమ్
పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ మనసు కళుక్కుమంది. నువ్వు రోజూ దిష్టి తీయించుకో అంటూ అతడిపై ప్రేమ ఒలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్.. పృథ్వీని చీఫ్ కంటెండర్‌గా సెలక్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్‌బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్కపిల్ల బొమ్మల మీద ఇంటిసభ్యుల పేర్లుంటాయి. ప్రతిఒక్కరూ తమపేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలక్ట్ చేసుకుని ఆడాల్సి ఉంటుంది.
ప్రతి రౌండ్‌కు కొత్త సంచాలక్
పప్పీని చివరగా ఇంటికి తీసుకొచ్చిన కంటెస్టెంట్‌తో పాటు పప్పీ మెడలోని ట్యాగ్‌పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్ ఇద్దరూ డేంజర్ జోన్‌లో నిలబడతారు. వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్‌లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడిగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్‌లో మణి, యష్మి.. డేంజర్ జోన్‌లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ.. యష్మిని గేమ్‌లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలనే తనను రేసు నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీలయ్యాడు.
మణిని టార్గెట్ చేశారా?
రెండో రౌండ్‌లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్‌లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి.. యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా.. తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవడ్రా మాట్లాడతాడు, పోరా.. నీకయితే చీఫ్ అయ్యే అర్హతే లేదు. నువ్వు ఎలా ఆడతావో చూస్తా.. అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణి శపథం చేశాడు. తర్వాత మణి వెళ్లి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుపట్టింది. అతడిపైకి గట్టి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది.
విష్ణు అవుట్
దీంతో మణి అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్లుగా ఉందని కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్లి ఓదార్చడం విశేషం. సీతూ అంటే ఇష్టం.. తనను తప్పుగా అర్థం చేసుందని ఎమోషనల్ అవడంతో వెంటనే ఆమె కూడా వెళ్లి ఓదార్చింది. మూడో రౌండ్‌లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్‌లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి.. విష్ణును గేమ్ నుంచి అవుట్ చేసింది. నాలుగో రౌండ్‌లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది.
అతడే చీఫ్
ఐదో రౌండ్‌లో నైనిక తన పప్పీ తనే తెచ్చేసుకోవడంతో గేమ్‌లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్‌లో గేమ్ పూర్తవలేదు కానీ ఆల్‌రెడీ నబీల్ చీఫ్ కంటెండర్‌గా, ఆ తర్వాత చీఫ్‌గానూ సెలక్ట్ అయ్యాడట! ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య ఓంను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment