వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్‌బాస్ హోటల్. ఈ టాస్క్‌లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
ఫన్ టాస్క్
బిగ్‌బాస్ అమ్మాయిలను ఒక టీమ్‌గా, అబ్బాయిలను ఒక టీమ్‌గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్‌కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్‌కు రోహిణిని లీడర్‌గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్‌సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్‌లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్‌లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు.
కప్పు కొడతా: గౌతమ్
తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.
ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణి
మరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్‌టైన్‌మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్.. ఇంటిసభ్యులు రేషన్‌లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్‌బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు.
ఎవరెవరు ఏ పాత్రలో..
పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్‌లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.
తికమక మనిషిగా హరితేజ
గంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్‌స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్‌ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్‌గా పాత్రలు పోషించారు.
మణిని ఆడుకున్న రోహిణి
టాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్‌మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్‌లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment