Bigg Boss 8: ఏడో వారం నాగమణికంఠ ఎలిమినేట్‌ | Bigg Boss Telugu 8: Naga Manikanta Entered As 10th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: పదో కంటెస్టెంట్‌గా నాగ మణికంఠ

Published Sun, Sep 1 2024 9:00 PM | Last Updated on Sun, Oct 20 2024 10:34 PM

Bigg Boss Telugu 8: Naga Manikanta Entered As 10th Contestant

నాగమణికంఠ సీరియల్‌ యాక్టర్‌. ఇతడు పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయాడు. దీంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఊహ తెలిసేసరికి తన ముందున్న తండ్రి కన్నవాడు కాదని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో కొట్లాటలు మొదలయ్యాయి. ఇవి చాలవన్నట్లు తన తల్లికి క్యాన్సర్‌ అని తేలింది. తనను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు కానీ అమ్మను బతికించుకోలేకపోయాడు. 2019లో తల్లిని కోల్పోయాడు. ఆమెకు తలకొరివి పెట్టిన పదకొండే రోజే ఇంటి నుంచి బయటకు వచ్చాడు.

దేవుడు ఒకటి లాక్కుంటే మరొకటి ఇస్తాడన్నట్లు మంచి ఉద్యోగం దొరికింది. కానీ ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. పెళ్లి చేసుకుంటే అమ్మ మళ్లీ తన కూతురిగా పుడుతుందని ఆశించాడు. వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. తల్లే తనకు కూతురిగా పుట్టిందని సంతోషించాడు. అంతలోనే గొడవలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చాడు. ఇన్ని కష్టాలు చూసిన ఇతడు తర్వాత నటుడిగా బుల్లితెరపై స్థానం సంపాదించాడు. బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో పదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కప్పు గెలుస్తానన్న ఇతడు ఏడోవారం హౌస్‌లో ఉండలేనంటూ తనే స్వయంగా ఎలిమినేట్‌ అయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement