Bigg Boss 8: స్టేజీపై భార్యను విలన్‌గా.. కానీ ఆమె బంగారం! | Bigg Boss Telugu 8: Naga Manikanta About His Wife Greatness | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: నాగమణికంఠ భార్య విలన్‌ కాదు, బంగారం! అసలు నిజం ఇదీ!

Published Mon, Sep 2 2024 6:02 PM | Last Updated on Mon, Sep 2 2024 6:56 PM

Bigg Boss Telugu 8: Naga Manikanta About His Wife Greatness

ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో పద్నాలుగు మంది అడుగుపెట్టారు. వారి మాటలు, స్టేజీపై వేసిన ఈవీ వీడియోల ప్రకారం ఎక్కువ కష్టాలు పడింది నాగమణికంఠనే! పుట్టిన మరుసటి ఏడాదికే తండ్రి చనిపోవడం, తల్లే ప్రపంచం అనుకుంటున్న సమయంలో ఆమె క్యాన్సర్‌తో కన్నుమూయడం.. గుండెనిండా ఆ బాధనే నింపుకున్న అతడు ఇంటి నుంచి ఏకాకిగా బయటకు వచ్చేశాడు.

భార్య విలన్‌ కాదు, బంగారం
పోనీ పెళ్లి చేసుకున్నాకైనా సంతోషంగా ఉన్నాడా? అంటే అక్కడ కూడా గొడవలు, కూతుర్ని సైతం వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇదంతా చూసిన జనాలు మణికంఠకు ఎన్ని కష్టాలో అనుకున్నారు. అతడి భార్య విలన్‌ అని అభిప్రాయపడ్డారు. కానీ తన భార్య బంగారం అంటున్నాడు మణికంఠ. లైవ్‌ ఎపిసోడ్‌లో ఆర్జే శేఖర్‌ బాషాతో.. తమ మధ్య గొడవలేం లేవని, ఇప్పటికీ భార్యతో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుతున్నట్లు తెలిపాడు.

ఎంకరేజ్‌ చేసిందే తను
బిగ్‌బాస్‌కు వచ్చే ముందు కూడా భార్య ఫోన్‌ చేసి కచ్చితంగా నువ్వు సక్సెస్‌ అవుతావ్‌, నీకు కావాల్సిన డబ్బు కూడా ఏర్పాటు చేస్తానందట. అయితే ఆ డబ్బును మణికంఠ అప్పుగా ఇమ్మంటే భార్యాభర్తల మధ్య అప్పేంటని తోసిపుచ్చింది. అలా తనను బిగ్‌బాస్‌కు వెళ్లమని ఎంకరేజ్‌ చేసింది కూడా భార్యేనని, షాపింగ్‌కు డబ్బులు కూడా పంపిందని తెలిపాడు. 

విడిపోలేదు, గొడవపడ్డారంతే!
కప్పు కొట్టేద్దామన్న ఆశ లేదు కానీ కొట్లాడైనా, ఏడ్చయినా, నవ్వయినా సరే.. వీలైనన్ని రోజులు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అతడు భార్యతో గొడవపడి అమెరికా నుంచి వచ్చేశాడే తప్ప విడిపోయి కాదని తన మాటలతో స్పష్టమైపోయింది. కూతురి కోసం సంపాదించాలన్న ఆలోచనతోనే అతడు ఇండియాకు వచ్చాడని తేలిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement