బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తుఫానులా రాబోతున్నాయంటూ కంటెస్టెంట్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. మంచి కంటెంట్ లేకపోవడంతో బోర్‌గా ఫీలవుతున్న బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఇక హౌస్‌లో కొత్త చీఫ్ కోసం బిగ్‌బాస్ ఓ పోటీ పెట్టాడు. పోయిన సీజన్‌లోని టాస్కునే మళ్లీ రిపీట్ చేశాడు. మొత్తం 10 మంది పేర్లు ఉన్న కుక్కబొమ్మలుంటాయి. బజర్ మోగగానే వాటిని తీసుకొచ్చి వాటికి కేటాయించిన హౌస్‌లో పెట్టాలి.
ఫెయిల్ అయినట్లేగా?
ఎవరైతే పప్పీని చివరగా తీసుకొస్తారో, ఆ సభ్యుడు.. అలాగే పప్పీ మెడలో ఎవరి పేర్లైతే ట్యాగ్ ఉందో ఆ సభ్యుడు.. ఇద్దరూ డేంజర్ జోన్‌లో నిలబడాల్సి ఉంటుంది. అలా మణికంఠ, యష్మి డేంజర్ జోన్‌లో నిలబడగా.. పృథ్వీ.. యష్మికి సపోర్ట్ చేసి మణిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావంటూ యష్మి.. అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అందరూ కలిసి తనను కార్నర్ చేస్తున్నారని మణి ఆవేదన వ్యక్తం చేశాడు.
మణికి దొరకని సపోర్ట్
తర్వాత ప్రేరణ, యష్మి.. డేంజర్ జోన్‌లో నిలబడ్డారు. తనకు చీఫ్‌గా మళ్లీ ఛాన్స్ వస్తే తనను కరెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుందని యష్మి చెప్పింది. దీంతో మణికంఠ.. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటాను అంటున్నావంటే ఇంతకుముందు చీఫ్‌గా ఫెయిలయ్యావా? అని సూటిగా అడిగాడు. ఆల్‌రెడీ చీఫ్ అని నన్ను రేసు నుంచి తీసేయడం ఎంతవరకు కరెక్ట్? అని యష్మి అడగ్గా.. యష్మి గేమ్‌లో నుంచి అవుట్ అని మణికంఠ తన నిర్ణయం చెప్పాడు.
సవాల్
మణికంఠపై పీకలదాకా కోపం పెంచుకున్న యష్మి.. ఈ హౌస్‌కు చీఫ్ అయ్యే అర్హతే ఇతడికి లేదనేసింది. ఏదో ఒకరోజు నేను చీఫ్ అయి చూపిస్తానని మణి సవాల్ చేయగా.. అవ్వరా అవ్వు, ఎట్లా ఆడతావో నేనూ చూస్తానంటూ సవాలు చేసింది. మొత్తానికి చీఫ్ అవ్వాలన్న మణి ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఇకపోతే నబీల్ కొత్త చీఫ్‌గా ఎంపికయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment