
నిన్న గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్ నేడు ఎమోషనల్‌గా మారనుంది. కంటెస్టెంట్లకు సంబంధించిన గిఫ్టులను ముందుపెట్టిన బిగ్‌బాస్ ఇవి అందరికీ కాదని, కొందరికి మాత్రమేనని తిరకాసు పెట్టాడు. దీంతో హౌస్‌మేట్స్ తమకు వచ్చిన గిఫ్టులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ బహుమతుల వెనక ఉన్న స్టోరీని బయటపెట్టారు.

మణికంఠ సూపర్..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఆదిత్య తన తండ్రి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. నాలో ఉన్న చెడు లక్షణాలు నేనే నేర్చుకున్నాను.. కానీ మంచి లక్షణాలు మాత్రం తన తండ్రి నుంచే వచ్చాయన్నాడు. మణికంఠకు శాలువా లాంటిది వచ్చింది. అయితే కంటెస్టెంట్లు దాన్ని ఏదో సింపతీతో తనకు ఇవ్వాలని మాత్రం కోరుకోవడం లేదన్నాడు.

కరోనా టైంలో నాన్న..
ఇప్పటికే సింపతీ గేమ్ అన్న ముద్ర పడటంతోనే తను గిఫ్టును సైతం ఆశించకుండా గుండె రాయి చేసుకుని నిలబడ్డాడు. నబీల్ వంతు రాగా.. మా నాన్నతో దిగిన చివరి ఫోటో ఇదే.. ఆయన కరోనా వల్ల చనిపోయారని తెలిపాడు. పృథ్వీ మాట్లాడుతూ.. ఆగస్టు 15న నేను మా నాన్నతో చాలా సేపు మాట్లాడాను. అదే ఆయన చివరి రోజు అవుతుందనుకోలేదు అని చెప్పాడు.

నాన్న ప్రేమ తెలీదు
ఇక చివర్లో బాషా తండ్రి గొప్పదనం గురించి చెప్తూ ఏడ్చేశాడు. మనందరికీ నాన్నంటే చాలా ఇష్టం. కానీ నాన్నకు మనమంటే ఎంతిష్టమనేది చాలామందికి తెలియదు. మీరు నాన్నయితే తప్ప ఆ ప్రేమ తెలియదు అని ఏడ్చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment