బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ మూడో వారం చేరుకుంది. సోమవారం (సెప్టెంబర్ 16) నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత రెండువారాలుగా చీఫ్ పోస్ట్‌లో ఉన్న యష్మి తొలిసారి నామినేషన్ల ప్రక్రియలో అడుగుపెట్టింది. దీంతో ఆమెను టార్గెట్ చేస్తూ నామినేషన్ చేశారు.
మణికంఠ, యష్మిల మధ్య నామినేషన్స్‌లో భాగంగా భారీ ఫైట్ నడిచింది. ఇద్దరూ కూడా గట్టిగట్టిగా అరిచారు. యాటిట్యూడ్ చూపించొద్దంటూ యష్మిపై మణికంఠ ఫైర్ అయ్యాడు. ఫ్రెండ్‍గా డ్రామాలు చేస్తున్నావా అంటూ మణిపై యష్మి విరుచుకుపడింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో తాను హౌస్‍లో ఉన్నంత కాలం మణిని నామినేట్ చేస్తూనే ఉంటానని యష్మి చెప్పింది. వారిద్దరి మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు.
తాజాగా విడుదలైన (డే-16) మంగళవారం ఎపిసోడ్‌లో యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతాడు. అదంతా నామినేషన్ వరకే అంటూ హగ్ చేసుకుంటాడు. కానీ, యష్మి మాత్రం తన హగ్‌ను రిజక్ట్ చేస్తుంది. వదిలేయ్ అంటూ కాస్త గట్టిగానే చెబుతుంది. ఈ సమయంలో యష్మి బాగా ఎమోషనల్ అవుతుంది. ఆపై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం పృథ్వీ వద్దకు వెళ్లి మణికంఠ ఇచ్చిన హగ్ గురించి చెబుతుంది. 'అతని హగ్ కంఫర్టబుల్‌గా లేదు.. అంతా ఫేక్.. నేను ఉన్నంత వరకు వాడిని (మణి) నామినేట్ చేస్తూనే ఉంటాను' అని చెబుతుంది.
Comments
Please login to add a commentAdd a comment