రొమాంటిక్‌  డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ భామ | Pranutan Bahl To Make Hollywood Debut In Coco And Nut | Sakshi
Sakshi News home page

Pranutan Bahl : రొమాంటిక్‌  డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ భామ

Published Fri, Jan 19 2024 9:49 AM | Last Updated on Tue, Jan 23 2024 8:30 PM

Pranutan Bahl To Make Hollywood Debut In Coco And Nut - Sakshi

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హిందీ తెరను ఏలిన అలనాటి తారల్లో నూతన్‌కి ప్రముఖ స్థానం ఉంది. 1950లలో చిత్రసీమలోకి అడుగుపెట్టి, 40 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 80 చిత్రాల్లో నటించి, చెరగని ముద్ర వేసుకున్నారు నూతన్‌. ఆమె వారసురాలిగా ప్రనూతన్‌ బహల్‌ హిందీ చిత్రం ‘నోట్‌బుక్‌’ (2019)తో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘హెల్మెట్‌’(2021) చిత్రంలో నటించిన ప్రనూతన్‌ బహల్‌ ఇప్పుడు హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.

అమెరికన్‌ యాక్టర్‌ రహ్సాన్‌ నూర్‌ నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించనున్న సినిమా ‘కోకో అండ్‌ నట్‌’. ఇంగ్లిష్, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ లవ్‌స్టోరీ సినిమా చిత్రీకరణ జూన్‌లో చికాగోలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇండియన్, ఇంగ్లిష్‌ నటీనటులు నటించనున్నారు. ‘‘ఓ రొమాంటిక్‌  డ్రామాతో హాలీవుడ్‌కు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రనూతన్‌.

‘‘నోట్‌బుక్‌’లో ప్రనూతన్‌ యాక్టింగ్‌ ప్రతిభను చూసినప్పట్నుంచి ఆమెతో కలిసి నటించాలనుకుంటున్నాను. ఈ సినిమాలో తన పెళ్లి విషయంలో కొంతమందితో పోరాడే అమ్మాయి పాత్రలో ప్రనూతన్‌ కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు రహ్సాన్‌ నూర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement