సాక్షి, అనంతపురం: అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఒక్కరోజు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జేసీని ఆదివారం పోలీసులు విచారించనున్నారు. దళిత సీఐ దేవేంద్ర ను దూషించి బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!)
ఫోర్జరీ డాక్యూమెంట్స్ కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పై విడుదలయిన వెంటనే దళిత పోలీసు అధికారి ని దూషించిన విషయాన్ని పిటీషన్‌లో పేర్కొన్నారు. కండీషన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment