
లైంగిక వేధింపుల కేసులో ప్రశ్నించనున్న పోలీసులు
నేడు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం
ఫిర్యాదుదారు లావణ్యను మరోసారి విచారించిన అధికారులు
మణికొండ: అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని లోతుగా ప్రశ్నించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడి అకృత్యాలు నిక్షిప్తమై ఉన్న హార్డ్ డిస్క్ కోసం లావణ్య ఇంటిపై దాడిచేసిన కేసులో మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఆ హార్డ్ డిస్‌్కలోని వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు.. అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఫిర్యాదుదారు లావణ్యను మంగళవారం మరోసారి స్టేషన్‌కు పిలిపించారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాలు, వాటిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం కోర్టులో పిటిషన్ వేసి మస్తాన్‌సాయిని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతకుముందే మస్తాన్‌సాయికి నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.
వెలుగులోకి వస్తున్న ఆకృత్యాలు..
కొన్నేళ్లుగా మస్తాన్‌సాయి పబ్‌లు, వీఐపీ పార్టీలలో యువతులు, వివాహిత మహిళలను మచ్చిక చేసుకుని వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ రికార్డింగులను హార్డ్ డిస్‌్కలో భద్రపరిచాడు. ఆ హార్డ్ డిస్‌్కను మస్తాన్‌సాయి ఇంటినుంచి తీసుకున్న లావణ్య.. పోలీసులకు అందించారు. ఆ హార్డ్ డిస్క్ కోసమే మస్తాన్‌సాయి తన ఇంటిపై దాడిచేసి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు.

కాగా, తనను డ్రగ్స్ కేసులో మరోమారు ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని లావణ్య న్యాయవాది నాగూర్‌బాబు ఆరోపించారు. వారి మధ్య జరిగిన సంభాషణ రికార్డులను మంగళవారం పోలీసులకు అందించామని తెలిపారు. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి, ఇంట్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించాలనే పథకం వేశారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ పోలీసులకు అందించి చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment