
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీ విధించడంతో ఆయనను పోలీసులు విచారించనున్నారు. లగచర్ల దాడి కేసులో నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.
వివరాల ప్రకారం..లగచర్ల దాడి కేసులో విచారణ చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం, నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం ఉదయం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలించనున్నారు. అక్కడే రెండు రోజుల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అయితే, న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి.. చర్లపల్లి జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment