తిరువనంతపురం : పోలీసు కస్టడీ అనంతరం జైలు నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే 17 ఏళ్ల నిఖిల్ పాల్ అనే యువకుడు మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులే లాఠీలతో అతడ్ని కొట్టి చంపారని నిఖిల్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం..ఓ టీనేజీ యువకుడిని డ్యాన్స్ చేయాలని కోరుతూ నిఖిల్ సహా మరో ముగ్గురు స్నేహితులు వేధింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి వీడయో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కస్టడీలో ఉన్న తమపై పోలీసులు లాఠీలతో హింసించారని యువకులు ఆరోపిస్తున్నారు. నిఖిల్‌ను దారుణంగా కొట్టారని, జైలు గది నుంచి బయటకు తీసుకెళ్లి చితకబాదారని పేర్కొన్నారు. పోలీసుల చర్య వల్ల నిఖిల్ చనిపోయాడని వారు పేర్కోన్నారు. కాగా ఈ ఆరోపణల్ని ఖండించిన అధికారులు..ఇది పూర్తి అవాస్తవమని తెలిపారు. (ఎవరీ దీపూ సిద్ధూ? నిన్న ఢిల్లీలో ఏం చేశాడు?)
Comments
Please login to add a commentAdd a comment