పోలీసు కస్టడీకి డ్రగ్స్‌ కేసు నిందితులు  | Hyderabad: Police Take Custody Of Two Suspects In Radisson Blu Drug Case | Sakshi
Sakshi News home page

పోలీసు కస్టడీకి డ్రగ్స్‌ కేసు నిందితులు 

Published Fri, Apr 15 2022 1:14 AM | Last Updated on Fri, Apr 15 2022 1:02 PM

Hyderabad: Police Take Custody Of Two Suspects In Radisson Blu Drug Case - Sakshi

అనిల్‌ను తీసుకొస్తున్న పోలీసులు  

బంజారాహిల్స్‌: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు ఉప్పల అభిషేక్, మహాదారం అనిల్‌కుమార్‌ను గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న వీరిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. డ్రగ్స్‌ పార్టీపై గురువారం నుంచి 4 రోజులపాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఈ నెల 3న పబ్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో కొకైన్‌ బయటపడటంతో పబ్‌ మేనేజర్‌ అనిల్, భాగస్వామి అభిషేక్‌పై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా అనిల్, ఏ–2గా అభిషేక్‌ను చేర్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అర్జున్‌ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement