రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌లో ఇటీవల అరెస్ట్ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. డ్రగ్స్ విక్రయ కేసులో ఇటీవల సైబరాబాద్ పోలీసులు నిర్మాతను అరెస్ట్ చేశారు. వారం రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు.. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. నేడు చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్ పోలీసులు కేపీ చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు.
(చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?)
టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్ సినీ ప్రముఖులతో పరిచయం ఉన్న కే.పీ.చౌదరి ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.సినీరంగంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నారు.
గోవా నుంచి హైదరాబాద్‌కు తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. టాలీవుడ్ ప్రముఖుల తో పాటు , సౌత్ ఆర్టిస్ట్ లతో కేపీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. విచారణలో కేపీ చౌదరి ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్ వాడిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అతనితో సన్నిహితంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖుల్లో గుబులు మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment