
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ఘటనలో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోటబొమ్మాళి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గత నెల 31న నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్న, ఆయనకు మద్దతుగా వెళ్లిన వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌పై అచ్చెన్నాయుడి సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌తో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారులెన అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment