Latest Updates: 2:00PM
ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ కస్టడి విచారణ కొనసాగుతోంది. పంజాగుట్ట పీఎస్‌లో ప్రత్యేక గదిలో భారీ భద్రత మధ్య విచారణ జరుగుతోంది. ప్రత్యేక ప్రశ్నావలి సిద్దం చేసుకొని పోలీసులు టోనీని ప్రశ్నిస్తున్నారు. అలాగే టోనీని ప్రశ్నించేందుకు ట్రాన్సిలేటర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అరెస్ట్ అయిన తమ్మిది మంది కంజూమర్స్‌తో సంబందాలాపై పోలీసులు ఆరా తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇంకా ఎంతమందితో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. టోనీ ఏజంట్స్ ఇమ్రాన్, నూర్‌లతో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతమంది ఏజంట్స్ ఉన్నారు, టోనీ కాల్ లీస్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఎవరివి? ఆ వ్యక్తులు ఎవరు? అన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ముఠాలో కీలక వ్యక్తిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని తదుపరి విచారణ నిమిత్తం బుధవారం వరకు(అయిదు రోజులు) పంజగుట్ట పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంచల్‌గూడ జైలునుంచి పోలీసులు టోనీని తరలించారు. 34 మంది వ్యాపారులకు టోకు టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యాపారస్తుల్ని కస్టడీకి అప్పగించాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇతడి విచారణలో మరికొందరు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతడితో పాటు అరెస్టు అయిన ఏడుగురిని కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించలేదు. దీంతో దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తొలిసారిగా వినియోగదారులు అరెస్టు
నగరంలో డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్ తగ్గిస్తేనే సరఫరా ఆగుతుందనే ఉద్దేశంతో సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ విక్రేతలతో పాటు వినియోగదారులనూ అరెస్టు చేయించారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో టోనీ, ముగ్గురు దళారులు మినహాయిస్తే మిగిలిన వినియోగదారులంతా నగరంలోని పెద్ద కుటుంబాలకు చెందిన వారే. వీరిలో పది మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. టోనీ సహా ఇతర పెడ్లర్ల కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్ షాహిద్ ఆలం, అఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబుతో పాటు అతడి భార్య, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్ కొనుగోలు, వినియోగదారులుగా గుర్తించారు. టోనీ తదితరుల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
చదవండి: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
సిటీలో ఇంకెందరు ఉన్నారో..?
నైజీరియా నుంచి వచ్చి ముంబైలో అక్రమంగా నివసిస్తున్న టోనీ 2013 నుంచి డ్రగ్స్ మాఫీయాను నడుపుతున్నాడు. దాదాపు అప్పటి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇతడి కస్టమర్ల జాబితాలో దాదాపు 60 మంది వరకు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కొకైన్ సరఫరా చేసే టోనీ ఒక్కోసారి గ్రాము రూ.20 వేలకు విక్రయించాడు. ఈ స్థాయిలో డబ్బు వెచ్చించి ఖరీదు చేసే వారిలో సంపన్నులే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, వీఓఐపీ కాల్స్ ద్వారా ఇతడు దందా చేస్తుండటంతో కాల్ డేటాలో అందరి వివరాలు బయటకురాకపోవడంతో కస్టడీలో రాబట్టాలని భావిస్తున్నారు.
నగరంలోని కొన్ని స్టార్ హోటల్స్, పబ్స్, రిసార్టుల నిర్వాహకులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ద్వారా తన దందా నిర్వహించినట్లు అనుమానిస్తూ ఆ కోణంలో విచారించాలని నిర్ణయించారు. ‘టోనీని శనివారం నుంచి పంజగుట్ట ఠాణాలో విచారిస్తాం. ఎంత మంది వ్యాపారస్తులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయో గుర్తిస్తాం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి’ అని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment